బద్ధ శత్రువులతో తాలిబన్ చర్చలు -అఫ్గాన్‌లో సర్కారుకై తంటాలు -తెరపైకి హమీద్ కర్జాయ్ -బ్రిటన్ మద్దతు
ఆయుధాలు చేతబట్టి అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం నానా తంటాలు పడుతున్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వకుంటే అంతర్జాతీయంగా గుర్తింపు లభించని స్థితిలో బద్ధ శత్రువులతోనూ సంధికి ప్రయత్నిస్తున్నారు ముష్కర నేతలు. హింస తప్ప మరో దారి తెలీని తాలిబన్లు.. పరిపాలనలో అంతో ఇంతో అనుభవం కలిగిన మాజీ నేతలను మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో తాము వ్యతిరేకించిన, తమతో బిభేధించిన వర్గాలు, జాతులతోనూ తాలిబన్లు సయోధ్యకు దిగుతున్నారు. ఏకంగా అంతర్జాతీయ టెర్రరిస్టులను రంగంలోకి దింపి చర్చలు జరుపుతున్నారు. ఆ క్రమంలోనే..

తెరపైకి హక్కానీ నెట్ వర్క్
అమెరికా, నాటో దళాల భరతం పట్టేందుకే పుట్టుకొచ్చిన హక్కానీ గ్రూప్, కాలక్రమంలో రష్యా, పాకిస్తాన్ తోనూ విభేదించి, తాలిబన్ సహా పలు తీవ్రవాద సంస్థలతో కలిసిపోయి హక్కానీ నెట్ వర్క్ గా కార్యకలాపాలు సాగిస్తున్నది. అఫ్గాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఈ హక్కానీ నెట్ వర్క్ కీలక నేతలు ఏకంగా తెరపైకొచ్చి చర్చల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. తాలిబన్ ప్రభుత్వానికి మద్దతిచ్చేలా వారి బద్ధ శత్రువులతో మాట్లాడే బాధ్యతను హక్కానీ నెట్‌వర్క్ సీనియర్ లీడర్ అనస్ హక్కానీ తలకెత్తుకున్నారు..

హమీద్ కర్జాయ్‌తో చర్చలు
అఫ్గాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తంటాలు పడుతోన్న తాలిబన్లు తమ వ్యతిరేకుల మద్దతునూ కూడగట్టేందుకు హక్కానీ చీఫ్ ను రంగంలోకి దించారు. హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాద సంస్థ సీనియర్ లీడర్ అనస్ హక్కానీ బుధవారం నాడు అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను కలుసుకున్నారు. కాబూల్ సిటీలో కర్జాయ్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అఫ్గాన్ జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. కీలకమైన యుద్ధ సమయంతోపాటు మొత్తం 13 ఏళ్లపాటు అఫ్గానిస్థాన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన కర్జాయ్ ని తాలిబన్లు మద్దతు కోరుతున్న క్రమంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి..

తండ్రిని చంపిన తాలిబన్లను క్షమిస్తాడా?
అఫ్గానిస్థాన్ లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడే గ్రూపులకు నేతృత్వం వహించి, 2001లో తాలిబన్ సర్కారును కుప్పకూల్చడంలో హమీద్ కర్జాయ ది కీలక భూమిక. ఇండియాలో చదువుకున్న కర్జాయ్ కుటుంబం కాందహార్ లోని పోపల్జయ్ తెగకు చెందింది. పాంజ్ షీర్ వాసుల మాదిరగానే కర్జాయ్ తెగ కూడా తాలిబన్లకు బద్ద వ్యతిరేకులు. తాలిబన్ల కట్టడికి కర్జాయ్ తోపాటు అయన తండ్రి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అఫ్గాన్ పై అమెరికా యుద్ధానికి కొద్ది రోజుల ముందే కర్జాయ్ తండ్రిని తాలిబన్లు హతమార్చారు. పాకిస్తాన్, ఇండియా, అమెరికా, యూరప్ దేశాలతో కర్జాయ్ కి గాఢమైన అనుబంధాలున్నాయి. మోడ్రన్ అఫ్గాన్ లక్ష్యంగా అమెరికా అండతో కర్జాయ్ గద్దెనెక్కినప్పటికీ ఖజానాపై ఆయనకు పెత్తనం లేకపోవడంతో అనుకున్నపనులేవీ చేయలేకపోయారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాయం కోరి వచ్చిన తాలిబన్లను కర్జాయ్ క్షమిస్తారా? అనేది కీలకంగా మారింది. ఇవాళ్టి..

మహిళల హక్కులపై కీలక చర్చ..
కాబూల్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా తాలిబన్లతో చర్చిస్తున్నారు. రాబోయే ఆఫ్ఘన్ ప్రభుత్వంలో తాలిబనేతరులకు కూడా స్థానం ఉండేవిధంగా చూడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తాలిబనేతర నేతలకూ కొత్త సర్కారులో చోటుకల్పించడం, గత 20 ఏళ్లలో అఫ్గానీలకు (ప్రధానంగా మహిళలకు) సంక్రమించిన హక్కులను పరిరక్షించడంపై ప్రధానంగా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సీనియర్ తాలిబన్ లీడర్ అమీర్ ఖాన్ ముత్తాకీ ఇప్పటికే అనేకసార్లు కాబూల్ రాజకీయ నేతలతో చర్చలు జరిపారు.

విదేశీ నిధుల కోసం తాలిబన్ ఆరాటం..
హమీద్ కర్జాయ్ తో హక్కానీ నేతల మీటింగ్ పై తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, రాబోయే ప్రభుత్వం 'మరింత సమ్మిళితం'గా ఉంటుందన్నారు. గతంలో తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన ముత్తాకీ వంటివారు ఇప్పటికే అఫ్గాన్ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతున్నామని, అమెరికా మిత్రులతో చర్చిస్తున్నామని,. నూతన ప్రభుత్వ ఏర్పాటు కొద్ది రోజుల్లోనే కొలిక్కి వస్తుందని చెప్పారు. కాగా, నిరంకుశత్వానికి మారుపేరైన తాలిబన్లు ప్రస్తుతం శాంతిమంత్రాలను వల్లె వేస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే వారు మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా మహిళా యాంకర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. 'మహిళలు రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికవడం మీకు అంగీకారమేనా?' అన్న ప్రశ్నకు తాలిబన్ నేతలు నవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే,

తాలిబన్లకు పెరుగుతోన్న మద్దతు..
దేశం లోపల వ్యతిరేక వర్గాలను సైతం మంచి చేసుకుంటోన్న తాలిబన్లకు అంతర్జాతీయంగానూ అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే పాకిస్తాన్ బాహాటంగా తాలిబన్లను సమర్థించగా, చైనా, రష్యాలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించాయి. తాజాగా, బ్రిటన్ సైతం తాలిబన్ పాలనను గుర్తించే దిశగా తొలి అడుగు వేసింది. అఫ్గాన్ లో సర్కారు ఏర్పాటు చేసుకునేలా తాలిబన్లకు అవకాశం ఇచ్చి చూడాలని, వాళ్లు(తాలిబన్లు) బాద్యతాయుతంగా మారారో లేదో ప్రపంచం చూసిన తర్వాతే తదుపరి నిర్ణయానికి వస్తే మంచిదని బ్రిటన్ ఆర్మీ చీఫ్ సర్ నిక్ కార్టర్ ప్రపంచదేశాలకు తాజాగా సూచించారు. 1990ల నాటి తాలిబన్ల కంటే ఇప్పుడున్నవారు భిన్నమైనవారు కావొచ్చని, అఫ్గాన్ పరిణామాలను ఆశావాద దృక్ఫథంతో చూడాలని కార్టిర్ అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications