కాచుకొని కూర్చొన్న తాలిబాన్లు.. నేటితో ముగియనున్న అమెరికా గడువు
ఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ లాంచర్లతో దాడి జరగడంతో కలకలం రేగింది. డ్రోన్ దాడులతో పౌరులు కూడా చనిపోయిన పరిస్థితి. దీనిని అమెరికా తీవ్రంగా ఖండించింది.
సోమవారం అమెరికా చాలా మంది సిబ్బంది, ప్రజలను తరలించింది. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలోనే తరలింపు ప్రక్రియ కొనసాగింది. కాబుల్ విమానాశ్రయం నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన వెంటనే.. తమ ఆధీనంలోకి తీసుకోవాలని తాలిబాన్లు కాచుకొని కూర్చొన్నారు.
మరోవైపు తమ దేశ పౌరులు తరలింపు ప్రక్రియను అమెరికా చేపడుతోంది. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్దంగా ఉన్న వ్యక్తిపై అమెరికా బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఐసిస్ కే గ్రూపునకు చెందినవాడు అని భావిస్తున్నారు. ఒకేరోజు రెండు వేర్వేరు ఘటనలతో కాబుల్ దద్దరిల్లిపోయింది.

ఇటీవల కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన పేలుళ్లలో 100 మందికి పైగా చనిపోయారు. 13 మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది.. ఇద్దరు ముష్కరులను అమెరికా దళాలు శనివారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తమ సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని అమెరికా ప్రతీనబూనింది. ఆ మేరకు వైమానిక దాడులకు దిగింది.
కాబూల్‌లో మరోసారి పేలుడు జరిగి సంగతి తెలిసిందే. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. ఇది కూడా ఐసిస్ పనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద దాడిని ముందే అనుమానించిన అమెరికా... ఆ దాడుల తర్వాత కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడి జరిగిందని తెలుస్తోంది. తాజా పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది, వారిలో ఒకరు చిన్నారి ఉన్నారు.












Click it and Unblock the Notifications