Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...

ఆఫ్గనిస్తాన్‌లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశంలో అందరి భద్రతకు,హక్కులకు హామీ ఇస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మున్ముందు ఆ మాటలు నిలబెట్టుకునే సూచనలు కనిపించట్లేదు. ముఖ్యంగా మహిళల పట్ల వారు అత్యంత కఠినంగా,నిర్దయగా వ్యవహరిస్తారనేది ఇప్పటికే వెలుగుచూసిన పలు ఘటనలతో వెల్లడైంది. తాజాగా తాలిబన్లు సెక్స్ వర్కర్స్‌ను టార్గెట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వేశ్యలను చంపేందుకు ప్లాన్...

వేశ్యలను చంపేందుకు ప్లాన్...


అంతర్జాతీయ మీడియా 'ది సన్' కథనం ప్రకారం... ఆఫ్గనిస్తాన్‌లో పడుపు వృత్తిలో ఉన్న వేశ్యలను చంపేందుకు తాలిబన్ డెత్ స్క్వాడ్ ఓ జాబితా సిద్ధం చేస్తోంది.ఇందుకోసం వారు పోర్న్ సైట్లను జల్లెడ పడుతున్నారు. అందులోని వీడియోల్లో ఆఫ్గన్‌కి చెందిన సెక్స్ వర్కర్స్ కనిపిస్తే వారి పేర్లను జాబితాలో చేరుస్తున్నారు. అలా జాబితాలో చేర్చిన సెక్స్ వర్కర్స్‌ను బహిరంగ శిరచ్చేదనం చేయనున్నారు. మరణశిక్షకు ముందు వారిపై గ్యాంగ్ రేప్ జరపడం లేదా రాళ్లతో కొట్టడం వంటి చర్యలకు కూడా పాల్పడుతారు.

సెక్స్ బానిసలుగా మారుస్తారు...

సెక్స్ బానిసలుగా మారుస్తారు...


ప్రస్తుతం తాలిబన్ డెత్ స్క్వాడ్ పోర్న్ సైట్లలో ఆఫ్గన్ సెక్స్ వర్కర్స్‌ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. జాబితా సిద్ధమయ్యాక వారిని కిడ్నాప్ చేసి లేదా బలవంతంగా ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి శిక్షలు అమలుచేసే అవకాశం ఉంది. వారిలో తమకు నచ్చినవారిని సెక్స్ బానిసలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది.గతంలో 1996-2001 తాలిబన్ల పాలనలో ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయి. సెక్స్ వర్కర్లను నడిరోడ్డుపై ఉరితీయడం,శిరచ్చేదనం చేసేవారు.

20 ఏళ్లుగా మహిళలపై అరాచకాలు....

20 ఏళ్లుగా మహిళలపై అరాచకాలు....

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం కోల్పోయాక కూడా మహిళల పట్ల వారి అరాచకాలు కొనసాగుతూ వచ్చాయి. గత 20 ఏళ్లలో ఎంతోమంది మహిళలను అక్రమ సంబంధాల పేరుతో వారు హత్యలు చేశారు. గత తాలిబన్ పాలనలో మహిళలకు విద్య,ఉద్యోగ హక్కులను పూర్తిగా నిరాకరించారు. వారు ఇంటి గడప దాటకుండా కట్టడి చేశారు. పెళ్లీడుకొచ్చిన యువతులను బలవంతంగా ఇళ్లల్లో నుంచి లాక్కెళ్లి పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరిని సెక్స్ బానిసలుగా మార్చుకున్నారు. ఇటీవల ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న కొద్దిరోజులకే మహిళలపై ఆంక్షలు మొదలుపెట్టారు. మహిళా ఉద్యోగులను ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల నుంచి ఇళ్లకు పంపించేశారు. తిరిగి కార్యాలయాలకు రావొద్దని హెచ్చరించారు. కొన్నిచోట్ల ఇంటింటికి తిరుగుతూ 15 ఏళ్లు పైబడ్డ బాలికలను తమతో రావాల్సిందిగా బలవంతం చేశారు. వచ్చినవారిని సెక్స్ బానిసలుగా మార్చడం రానివారిని హత్య చేయడం చేశారు.

హక్కుల కోసం గొంతెత్తుతున్న ఆఫ్గన్ మహిళలు

హక్కుల కోసం గొంతెత్తుతున్న ఆఫ్గన్ మహిళలు


కాబూల్‌ను ఆక్రమించిన 3 రోజులకు తాలిబన్లు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక నుంచి ఆఫ్గనిస్తాన్‌లో ఎలాంటి యుద్ధం ఉండదని ఆ ప్రెస్‌ మీట్‌లో ప్రకటించారు. అశాంతికి ఆస్కారం లేదని... ఏ దేశంతోనూ తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని తెలిపారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. విదేశీ విధానాలను అమలుచేసిన మాజీ సైనిక సభ్యులతో పాటు అందరినీ క్షమించేశామని... వారి ఇళ్ల కోసం ఎవరూ వెతకరని తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్ట ప్రకారం మహిళా హక్కులు గౌరవించబడుతాయని పేర్కొన్నారు.ఎడ్యుకేషన్,హెల్త్ ‌సెక్టార్‌లతో పాటు వారి సేవలు ఏయే రంగాల్లో అవసరమో.. అక్కడ వారు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగానే ఉన్నాయి. దీంతో అక్కడి మహిళల భద్రతపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశం వారికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగే సూచనలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌లోని మహిళలు తాలిబన్లపై తిరగబడుతున్నారు. తమకు హక్కులు కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. శనివారం పదుల సంఖ్యలో మహిళలు కాబూల్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే తాలిబన్లు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఆఫ్గనిస్తాన్‌లో అంతర్యుద్దం తప్పదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+