ఆఫ్ఘనిస్తాన్ లో ఇండిపెండెన్స్ డే-తాలిబన్ల సంబరాలు- బ్రిటీష్ పాలన ముగిసిన రోజు

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం పాలన ముగిసి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా మారనిది ఒకే ఒక్కటి. అదే వారి స్వాతంత్ర దినోత్సవం. ఇవాళ తాలిబన్లు తమ దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. 1919లో సరిగ్గా ఇదే రోజు బ్రిటీషర్ల పాలన నుంచి ఆప్ఘనిస్తాన్ కు స్వాతంత్రం లభించింది. దీంతో ఆప్ఘన్ ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఈ రోజు స్వాతంత్ర దినం నిర్వహిస్తోంది.

Recommended Video

    Who Are Talibans | Afghanistan a Graveyard of Superpowers | Oneindia Telugu

    ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్దానంలో తాలిబన్ల పాలన వచ్చినా అప్పటి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నందున వీరు కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ అక్కడి ప్రజా ప్రభుత్వానికి బ్రిటీష్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. వేల కొద్దీ సైన్యాన్ని మోహరించి అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాపలా కాసింది. అయితే అమెరికా తమ బలగాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో బ్రిటీష్ బలగాలు కూడా వెనుదిరిగాయి. ఆ తర్వాత నెలకొన్న పరిస్ధితుల్లో ఆప్ఘన్ పౌరులకు పాస్ పోర్టు లేకుండానే తమ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆశ్రయం కూడా ఇచ్చేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది.

    talibans celebrating first independence day in thier regime in afghanistan

    ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పౌరులకు ఉచిత ఎంట్రీతో పాటు ఆశ్రయం ఇస్తున్న బ్రిటన్ కు వ్యతిరేకంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవాన్ని తాలిబన్లు జరుపుకుంటున్నారు. తమ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఒకప్పుడు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆప్ఘన్లు.. ఇప్పుడు ఆ దేశం తమకు అండగా నిలుస్తున్నా కూడా స్వాతంత్ర వేడుకల్ని మాత్రం మర్చిపోలేదు.

    గతంలో 1878-80 మధ్య సాగిన రెండో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఆ యుద్ధంలో ఓటమిపాలైన ఆప్ఘనిస్తాన్ కు స్వాతంత్ర మిస్తూనే 1919లో బ్రిటీష్ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది ఇకపై ఇరుదేశాల మధ్య తటస్ధ సంబంధాలు కొనసాగాలన్నదే ఆ ఒప్పందం సారాంశం. అది ఇప్పటికీ అమల్లోనే ఉన్నప్పటికీ మధ్యలో అమెరికా తో పాటు బ్రిటన్ కూడా ఇక్కడి ప్రజాప్రభుత్వానికి మద్దతు పేరుతో ఆప్ఘన్ లో పాగా వేశాయి. ఇప్పుడు తాలిబన్ల పాలనలో బ్రిటన్ దళాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు స్వాతంత్ర వేడుకలు చేసుకంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+