షాకింగ్ వీడియో- తాలిబన్ మార్క్ శిక్ష-వాహనాల్లో ఊరేగిస్తూ ఉరి-మహిళల్ని కిడ్నాప్, రేప్ చేసినందుకు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారం చేపట్టిన తాలిబన్లు మహిళలపై అకృత్యాలు చేస్తున్నారని, వారిని పాశ్చాత్య ధోరణులకు దూరంగా ఉంచుతున్నారని, కనీసం విద్యాభ్యాసానికి కూడా అనుమతి ఇవ్వడం లేదనే వార్తలు మనం వింటూనే ఉంటాం. కానీ ఈసారి తాలిబన్లు అదే మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వారికి తమ మార్క్ శిక్షలు రుచి చూపించిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఆప్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్ లో మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు ఇద్దరు యువకుల్ని వాహనాల్లో ఊరేగిస్తూ ఉరిశిక్ష విధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. మరోసారి మహిళల్ని కిడ్నాప్ చేయాలన్నా, అత్యాచారం చేయాలన్నా, కనీసం కన్నెత్తి చూడాలన్నా భయపడేలా తాలిబన్లు షరియా చట్టాల ప్రకారం ఈ శిక్షలు అమలు చేశారు. దీంతో తాలిబన్ల నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
This is from Herat Province. These men kidnapped women and then rapped them & also tortured the kidnapped women very brutally. The authorities delivered justice to these criminals. https://t.co/SzHPrbFvJ5
— Muhammad Jalal (@MJalal313) November 8, 2021

Recommended Video
తాజాగా ఆప్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు యువకుల్ని రెండు వాహనాల్లో తిప్పుతూ ఉరి విధించడం, ఉరి కొయ్యకు వారు వేలాడుతూ గింజుకుంటున్న దృశ్యాలు చూసేందుకే భయపెడుతున్నాయి. వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లేన్లకు వీరిని వేలాడదీసి ఉరేసినట్లు తెలుస్తోంది. వాహనాలు కదులుతుండగానే వీరికి ఉరిశిక్ష అమలవుతోంది. బహిరంగంగా రోడ్లపై ఊరేగిస్తూ అమలు చేసిన ఈ ఉరిశిక్షలు ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ లోనూ కలకలం రేపుతున్నాయి.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications