సోషల్ మీడియా పిచ్చి ప్రాణం తీసింది: నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..
చెప్పినట్లే సన్ షేడ్ పైకి దూకడం.. ఆ వెంటనే అది విరిగిపోయి కుప్పకూలడం.. ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.
సింగపూర్: సోషల్ మీడియా వచ్చాక ఏం చేసైనా సరే జనాలను ఆకర్షించాలన్న పిచ్చి చాలామందిలోను పెరిగిపోయింది. చిత్ర విచిత్ర విన్యాసాలతో పాటు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇలా ప్రతీ చోట ఫోటోలు దిగడం, వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం కామన్ గా మారిపోయింది. ఈ ప్రయత్నంలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతుండటం గమనార్హం.
తాజాగా ఇదే తరహాలో ప్రయత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జొనాథన్ చో(17), తన స్నేహితురాలితో కలిసి సింగపూర్ లోని ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. మాల్ లోని నాలుగో అంతస్తులో ఉన్న సమయంలో ఓ సాహసం చేయాలనుకున్నాడు. నాలుగో అంతస్తు నుంచి సన్ షేడ్ పైకి దూకుతానని, అదంతా వీడియో తీయాలని గర్ల్ ఫ్రెండ్ ను కోరాడు.

చెప్పినట్లే సన్ షేడ్ పైకి దూకడం.. ఆ వెంటనే అది విరిగిపోయి కుప్పకూలడం.. ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. అయితే సన్ షేడ్ కాంక్రీట్ తో చేసి ఉంటుందని తాము భావించామని, ఇలా ప్లాస్టిక్ తో చేసి ఉంటారని తాము ఊహించలేదని యువకుడి గర్ల్ ఫ్రెండ్ తెలిపింది.
సన్ షేడ్ ప్లాస్టిక్ తో చేసింది కావడంతో అతని బరువు ఆపలేక అది కుప్పకూలిపోయింది. దీంతో జొనాథన్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేసిన జొనాథన్ సింగపూర్ లో నేషనల్ సర్వీస్ పూర్తి చేయడం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సోషల్ మీడియాపై ఉన్న వెర్రి జొనాథన్ ప్రాణాలు తీసిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications