వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్యంలో కాల్పుల మోత - 10 మంది మృతి : బైడెన్‌ విచారం..!!

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. యువకుడు టాప్స్‌ ఫ్రెండ్లీ సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు.

అందులో ఉన్న వారిపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో పదిమంది దుర్మరణం చెందారని సిటీ పోలీస్ అధికారి జోసెఫ్ గ్రామగ్లియా వెల్లడించారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్​బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

Ten Killed In Racially Motivated Shooting At New York Store

కాల్పుల ఘటనకు జాతివిద్వేషమే కారణంగా భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో మృతుల్లో 8 మంది నల్లజాతీయులు, ఇద్దరు శ్వేతజాతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఈ మధ్యే రిటైర్‌ అయిన పోలీస్‌ ఆఫీసర్‌ కూడా ఉన్నాడని, అతడు ప్రస్తుతం సూపర్‌మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని చెప్పారు. నిందితుడు కాల్పుల ఘటనను హెల్‌మెట్‌కు అమర్చిన కెమెరాతో లైవ్‌ స్ట్రీమ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు.

English summary
At least 10 people were killed after a man opened fire at a supermarket in Buffalo, New York.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X