బాంబు అంటూ అరెస్టు: రూ. 100 కోట్లు ఇవ్వండి
హ్యూస్టన్: కేవలం ముస్లిం యువకుడు అని ఆరోపిస్తూ ఎలాంటి విచారణ చెయ్యకుండా తనను అరెస్టు చేసి అవమానించినందుకు రూ. 100 కోట్లు (15 మిలియన్ డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ పాఠశాల విద్యార్థి పలువురికి నోటీసులు పంపించాడు.
తన తెలివితేటలు గుర్తించకుండా తనను అరెస్టు చేసి అవమానించారని, సాటి విద్యార్థుల దగ్గర తల ఎత్తుకోనివ్వకుండా చేశారని అమెరికాలోని టెక్సాస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న అహమ్మద్ మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అహమ్మద్ మహమ్మద్ తన సొంత తెలివితేటలతో ఓ అలారం గడియారం తయారు చేసి స్కూల్ కు తీసుకు వెళ్లాడు. అది బాంబు అని తప్పుగా భావించిన టీచర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి అతను ప్రపంచ దేశాలకు పరిచయం అయ్యాడు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివితేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు, వైట్ హౌస్ ఇప్పటికే అహమ్మద్ మహమ్మద్ ను ఘనంగా సత్కరించింది.

విషయం తెలుసుకున్న ఖతార్ లోని ఓ ముస్లీం పౌండేషన్ ఆవిద్యార్థిని చదివించడానికి ఆసక్తి చూపించడంతో అతను ఖతార్ వెలుతున్నాడు. ఇదే సమయంలో ఆ బాలుడు తనను అవమానించిన వారి నుంచి నష్టం పరిహారం వసూలు చెయ్యాలని నిర్ణయించాడు.
ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ తనకు క్షమాపణలు చెప్పి 10 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని, తప్పుగా అర్థం చేసుకుని ముస్లీం విద్యార్థి పట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.
అంతే కాకుండ తనకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని అహమ్మద్ మహమ్మద్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై బాలుడి న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications