Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యాయ కేంద్రంపై ఉగ్రదాడి.. 8 మంది మృతి, దాడుల వెనుక జిహాదీ గ్రూప్!

Terror Attack: ఇరాన్‌లోని ఆగ్నేయ నగరమైన జాహెదాన్‌లో శనివారం ఉదయం ఒక న్యాయ కేంద్రంపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది మరణించగా.. 13 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

న్యాయభవనంపై మెరుపుదాడి
జాహెదాన్‌లోని న్యాయ భవనంపై సాయుధులైన ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మరణించిన 8 మందిలో ఐదుగురు సామాన్య పౌరులు ఉండగా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లోని న్యాయ కేంద్రంపై గుర్తుతెలియని సాయుధులు దాడి చేశారని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్‌లైన్ పేర్కొంది. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు మరణించారని, 13 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది.

Terror Attack on Judicial Center in Iran 8 Dead Responsibility Claimed by Jihadist Group

ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఉగ్రవాదులు భవనంలోకి ప్రవేశించేందుకు సందర్శకుల లాగా వేషధారణతో ప్రయత్నించారని సిస్తాన్-బలూచిస్తారన్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరి వెల్లడించారు. భద్రతా దళాలు తక్షణమే స్పందించి, వారిని అడ్డుకుని హతమార్చడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

దాడికి బాధ్యత వహించిన జిహాదీ గ్రూప్
ఈ దాడికి పాకిస్థాన్ దేశంలో స్థావరం కలిగి, ఇరాన్‌లో కూడా చురుకుగా ఉన్న బలూచ్ జిహాదీ గ్రూప్ జైష్ అల్-అదల్ బాధ్యత వహించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఈ సంస్థ పలు దాడులకు పాల్పడిన చరిత్ర ఉంది. తాజా దాడితో జాహెదాన్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+