టెక్సాస్ వర్సిటీలో కలకలం: అగంతకుడి కాల్పుల్లో పోలీస్ మృతి..

Subscribe to Oneindia Telugu

టెక్సాస్: టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీలో ఓ అగంతకుడి కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో పోలీస్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం లబ్‌బాక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

యూనివర్సిటీ క్యాంపస్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. డ్రగ్స్ సరఫరాపై తమకు సమాచారం అందడంతో పోలీసులకు తనిఖీలకు వచ్చారు. ఈ క్రమంలో క్యాంపస్ లో అనుమానంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసునేందుకు ప్రయత్నించగా.. తుపాకీతో అతను కాల్పులు జరిపాడు.

Texas Tech University police officer fatally shot, suspect in custody

నిందితుడిని హోల్లిస్ డేనియల్స్(19)గా గుర్తించారు. ఘటనలో అధికారి ప్రాణాలు కోల్పోగా.. అగంతకుడు వారి నుంచి తప్పించుకున్నాడు.ఆపై క్యాంపస్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు డేనియల్ ను పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Texas Tech University police officer was shot and killed Monday night at the Police Department's headquarters, prompting a lockdown at the Lubbock school that lasted for more than an hour as officials searched for the gunman.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి