ట్రంప్ కోసం గొడవ.. కూతురిని కాల్చి చంపిన తండ్రి!
రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఒక్కోసారి ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పడానికి టెక్సాస్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తుపాకుల వాడకంపై తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనను చూడటానికి వచ్చిన కన్నకూతురినే ఓ తండ్రి తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే?
బ్రిటన్‌లోని చెషైర్‌కు చెందిన లూసీ హారిసన్ (23) ఓ ఫ్యాషన్ బయర్‌గా పనిచేస్తోంది. చాలా కాలం తర్వాత తన తండ్రి క్రిస్ హారిసన్‌ను కలిసేందుకు ఆమె తన ప్రియుడు సామ్ లిటిలర్‌తో కలిసి టెక్సాస్‌లోని ప్రాస్పర్ నగరానికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, అమెరికాలోని తుపాకీ సంస్కృతి గురించి తండ్రీకూతుళ్ల మధ్య చర్చ మొదలైంది. ఈ చర్చ కాస్తా వాగ్వాదంగా మారింది.

మనసు గాయపరిచిన తండ్రి మాటలు
ట్రంప్ చుట్టూ ఉన్న లైంగిక వేధింపుల వివాదాల గురించి ప్రస్తావిస్తూ.. "ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉండి వేధింపులకు గురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు?" అని లూసీ తన తండ్రిని సూటిగా ప్రశ్నించింది. దానికి తండ్రి క్రిస్ అత్యంత నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. "నాకు మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, అది నన్ను అంతగా బాధించదు" అని వ్యాఖ్యానించాడు. కన్న తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు లూసీని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఏడుస్తూ పైఅంతస్తులోకి వెళ్ళిపోయింది.
15 సెకన్ల వ్యవధిలో విషాదాంతం
తండ్రి వద్ద తుపాకీ ఉండటం లూసీకి మొదటి నుంచీ ఇష్టం లేదు. దీనిపై గతంలో కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసేది. ఘటన జరిగిన రోజు.. లూసీ కిచెన్‌లో ఉండగా, క్రిస్ ఆమె చేయి పట్టుకుని తన బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. లూసీ ప్రియుడు సామ్ బయట ఉండగా.. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే గదిలో నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. సామ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి లూసీ రక్తపు మడుగులో పడి ఉంది. తుపాకీ తూటా ఆమె ప్రాణాలను తీసేసింది.
మద్యం మత్తులో తండ్రి ఘాతుకం
కుటుంబ రక్షణ కోసమే తాను తుపాకీ కొన్నానని.. ఆ రోజు కేవలం లూసీకి దాన్ని చూపించడానికి మాత్రమే తీశానని క్రిస్ కోర్టులో వాదించాడు. తనకు తెలియకుండానే గన్ పేలిందని, తన వేలు ట్రిగ్గర్‌పై ఉందో లేదో కూడా గుర్తులేదని బుకాయించాడు. అయితే, క్రిస్‌కు గతంలో మద్యపాన వ్యసనం ఉందని, ఘటన జరిగిన రోజు కూడా ఆయన సుమారు 500 మి.లీ వైన్ తాగినట్లు విచారణలో తేలింది. "నా కూతురిని కోల్పోయిన బరువును నా జీవితాంతం మోయాల్సిందే" అని ఆయన కోర్టులో వాపోయాడు. ఈ ఘటన కేవలం ఒక హత్య మాత్రమే కాదు.. మితిమీరిన గన్ కల్చర్, రాజకీయ మూర్ఖత్వం కుటుంబ బంధాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఒక చేదు నిదర్శనం.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది! -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications