Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

21 మంది ప్రాణాలు తీసిన సైకో సైనికుడు హతం: కాల్చి చంపిన భద్రతా దళాలు

బ్యాంకాక్: థాయిలాండ్‌లో శనివారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 21 మంది ప్రజల ప్రాణాలు తీసిన సైకో సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మాను ఆదివారం ఉదయం రక్షణ దళాలు మట్టెబెట్టాయి. నఖోన్ రట్చసిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విచక్షణా రహితంగా కాల్పులు..

విచక్షణా రహితంగా కాల్పులు..

సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన జక్రపంత్ తొమ్మ నగరంలో తిరిగాడు. వాహనంపై వెళుతూ దారినపోయే వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత నగరంలోని టెర్మినల్ 21 మాల్‌లో ప్రవేశించి తన వద్ద ఉన్న మెషిన్ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

భయంతో జనం పరుగులు..

భయంతో జనం పరుగులు..


ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అనేక మందికి తుపాకీ తూటాలు తగిలాయి. దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరికి తీవ్రగాయాలపాలయ్యారు. కాల్పుల శబ్ధంతో మాల్‌లో ప్రజలంతా భయాందోళనతో పరుగులు తీశారు. తుపాకీ సంచరిస్తూ ఆ సైనికుడు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో కొందమందిని అతడు నిర్బంధించాడు.

సైకో సైనికుడ్ని మట్టుబెట్టిన భద్రతా దళాలు..

సైకో సైనికుడ్ని మట్టుబెట్టిన భద్రతా దళాలు..

సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు అక్కడికి చేరుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అతని కోసం కాపుకాశారు. ఆదివారం ఉదయం సైకో సైనికుడ్ని గుర్తించి భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. దీంతో అక్కడ కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే, అప్పటికే సైకో సైనికుడి కాల్పుల్లో 21 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.

కాల్పులు జరపడానికి ఆత్రూతగా ఉన్నట్లు..

కాల్పులు జరపడానికి ఆత్రూతగా ఉన్నట్లు..

కాగా, మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉండటం గమనార్హం. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సైకో సైనికుడ్ని హతమార్చినట్లు అధికారులు, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, సైకో సైనికుడు కాల్పుల ఘటనకు పాల్పడే ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టాడు. కాల్పులు జరపడానికి వేళ్లు ఆత్రూతగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+