రాణి పుట్టినరోజు వేడుకలు: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయిలాండ్

థాయిలాండ్: వరుస బాంబు పేలుళ్లతో థాయిలాండ్ దద్దరిల్లింది. రాజధాని బ్యాంకాక్‌లోని పటోంగ్ రిసార్టులో గురువారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో ఓ మహిళ మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు.

థాయిలాండ్ రాణి సిరికిట్ బర్త్ డే వేడుకల సందర్భంగా శుక్రవారం సెలవు దినం కావడంతో సెలెబ్రేట్ చేసేందుకు ప్రజలు హువా హిన్ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి పదిన్నర గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి.

తొలుత సిటీలోని క్లాక్ టవర్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. మరికొద్ది గంటలకు తర్వాత పటోంగ్‌ రిసార్ట్‌ బీచ్‌ వద్ద రెండో పేలుడు చోటుచేసుకుంది. ఈ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Thailand bombs: Hua Hin resort hit by twin blasts

గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. మొదటి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత మరో బాంబు పేలిందని పోలీసులు తెలిపారు.

పేలుళ్ల వెనుక ఉన్న ఉద్దేశం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో థాయిలాండ్‌లో ముఖ్యంగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+