సుప్రీం కోర్టు ముందు హాజరైన మాజీ ప్రధాని (వీడియో)

బ్యాంకాక్: అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న థాయ్ లాండ్ మాజీ ప్రధాని సుప్రీం కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. మంగళవారం థాయ్ లాండ్ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా (46) తన మద్దుతుదారులతో కలిసి కోర్టు దగ్గరకు చేరుకున్నారు.

Thailand ex pm rice subsidy scheme in supreme court

షినవత్రా ప్రధాన మంత్రిగా పని చేసే సమయంలో బియ్యం సబ్సిడి పథకం కేటాయింపులలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కేసు నమోదు కావడంతో సుప్రీం కోర్టులో మంగళవారం కేసు విచారణ మొదలయ్యింది.

గత సంవత్సరం సైనిక తిరుగుబాటుతో షినవత్రా తన పదవిని బలవంతంగా వదులుకుని గద్దెదిగారు. అంతే కాకుండ ఆమె ఎన్నికలలో పోటి చెయ్యకుండా ఐదు సంవత్సరాలు నిషేధం విధించారు. షినవత్రా నేరం చేసినట్లు రుజువు అయితే సుమారు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రాజకీయ కుట్రలో భాగంగా తనను కేసు ఉచ్చులోకి లాగారని షనవత్రా ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+