వక్షోజాలు కనిపించేలా వద్దు: యువతులకు ప్రభుత్వం హెచ్చరిక
బ్యాంకాక్: యువతులు వక్షోజాలు కొంత కనిపించేలా సెల్ఫీలు దిగి పోస్ట్ చేయడంపై థాయ్‌లాండ్ మిలటరీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటివి చేయవద్దని వారించింది. వక్షోజాలు కొంత భాగం పైకి కనిపించేలా దుస్తులు ధరించి సెల్ఫీ దిగి, వాటిని పోస్ట్ చేస్తున్నారు.
ఇలాంటివి వద్దని మిలటరీ ప్రభుత్వం హెచ్చరించింది. కొందరు అసభ్యకరంగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, ఇలాంటివి చట్ట వ్యతిరేకమని, ఇవి కంప్యూటర్ క్రైమ్ చట్టం పరిధిలోకి వస్తాయని థాయ్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

థాయ్ మిలటరీ ప్రభుత్వం యొక్క 2007 కంప్యూటర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజలను భయానికి లేదా భీతి కల్పించేలా సోషల్ మీడియాను ఉపయోగించవద్దు. కాగా, ప్రభుత్వ సెన్సార్ షిప్ చేస్తోందంటూ కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వక్షోజాలు కొంత కనిపించేలా సెల్ఫీలు దిగుతున్న వారు ఎక్కువమంది తమ ముఖాలు కనిపించకుండా.. సోషల్ మీడియాలో పెడుతున్నారని, ఇది ఇబ్బందికరంగా మారిందని, అంతేకాకుండా మరికొందరిని ఇది ప్రోత్సహించేలా ఉందని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అయితే, చాలామంది ముఖాలు కనిపించకుండా పోస్ట్ చేస్తుండటం వల్ల వారిని ఎలా గుర్తిస్తారనే విషయం మాత్రం అర్థం కాకుండా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications