పాక్‌పై మనం మధ్యలో వదిలిపెట్టిన పనిని వాళ్లు పూర్తి చేసేలా ఉన్నారు..

Balochistan Liberation Army: భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంది. భారత్- పాకిస్తాన్ నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు సంభించలేదు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.

పాకిస్తాన్‌లో పరిస్థితులు కుదుటపడట్లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ విరచుకుపడుతోంది. పాక్ ఆర్మీ శిబిరాలపై భారీగా దాడులు సాగిస్తోంది. ఆర్మీ స్థావరాలపై విస్తృతంగా ఈ దాడులు చేపట్టింది. భారత్ దాడులతో అల్లకల్లోలానికి గురైన పాక్ ఆర్మీకి ఇప్పుడు అతి పెద్ద సవాల్ విసురుతోంది. పాక్‌పై భారత్ మధ్యలో వదిలిపెట్టిన పనిని బలూచ్ ఆర్మీ పూర్తి చేసేలా కనిపిస్తోంది.

The Baloch Liberation Army claims 71 attacks on Pakistani military across 51 sites

పాకిస్తాన్‌లో 51 ప్రాంతాల్లో ఆర్మీకి చెందిన 71 శిబిరాలపై దాడులు సాగించినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ అధికారికంగా ప్రకటించింది. వీటిని తాము కోఆర్డినేట్ చేసిట్లు వెల్లడించింది. ఆక్యుపైడ్ బలూచిస్తాన్‌లో ఈ మెరుపుదాడులు సాగాయని, ఈ ప్రాంతంలో ఓ కొత్త శకం అనివార్యం అని తేల్చి చెప్పింది.

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌లు, ఇంటెలిజెన్స్ కేంద్రాలపై ఈ దాడులు సాగినట్లు తెలుస్తోంది. అలాగే బలూచ్ రీజియన్‌ నుంచి ఖనిజాలు, ఇతర వనరులు తరలించే ట్రక్కులు, ఇతర వాహనాలపై ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎంత నష్టం సంభవించిందనేది వెల్లడించలేదు.

తాము విదేశీయులకు తొత్తుగా వ్యవహరిస్తోన్నామని వచ్చిన ఆరోపణలన్నింటినీ కూడా బీఎల్ఏ కొట్టిపారేసింది. బలూచ్ రీజియన్ అభివృద్ధిలో తాము నిర్ణయాత్మక శక్తిగా ఉంటోన్నామని, చురుకైన పాత్ర పోషిస్తోన్నామని పేర్కొంది. పాకిస్తాన్‌తో ప్రాక్సీ వార్ జరుపుతున్నామనే ఆరోపణలను ఖండిస్తున్నాని బీఎల్ఏ అధికారిక ప్రతినిధి తెలిపారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తాము మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో క్రియాశీలకంగా ఉండబోతోన్నామని స్పష్టం చేశారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది అంతర్జాతీయ సమాజం త్వరలోనే చూస్తుందని పేర్కన్నారు.

పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది మోసపూరితమని ఆరోపించింది. పాకిస్తాన్ చెప్పే మోసపూరిత శాంతి ప్రకటనలను నమ్మ వద్దని భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. పాకిస్తాన్ ఆర్మీపై తాము సాగిస్తోన్న దాడులను యుద్ధ సన్నద్ధతగా భావించాలని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితులను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌ను హెచ్చరించింది బలోచ్ ఆర్మీ. తమపై అణచివేతను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌ ఇదే వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో బలూచిస్తాన్ స్టేట్ ఉనికి కోల్పోతుందని, అలాంటి పరిస్థితులే తలెత్తితే తీవ్ర పరిణాలు ఉంటాయనీ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+