వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Supermoon 2022: అంతరిక్షంలో మరో అద్భుతానికి కౌంట్‌డౌన్: నెల రోజుల్లో రెండోసారి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోబోతోంది. కిందటి నెల 14వ తేదీన స్ట్రాబెర్రీ మూన్ ఏర్పడగా.. తాజాగా సూపర్ మూన్ సంభవించనుంది. కిందటి నెల పౌర్ణమి రోజున చంద్రుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించాడు. అలాంటి సందర్భమే ఇప్పుడు మళ్లీ ఏర్పడబోతోంది. భూకక్ష్యకు అత్యంత సమీపానికి చంద్రుడు రాబోతోన్నాడు. బుధవారం చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు..కనువిందు చేయబోతోన్నాడు.

ఈ సమయంలో భూమికి-చంద్రుడికి మధ్య ఉండే దూరం 3,57,256 కిలోమీటర్లు. ఆ సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తీవ్రత అధికంగా ఉంటోంది. సముద్రంలో అలలు సాధారణ స్థితి కంటే ఎక్కువగా పోటెత్తుతాయి. సముద్రం ముందుకు దూసుకొచ్చే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. చంద్రుడిలో ఉండే గురుత్వాకర్షణ శక్తి అధికంగా కావడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది.

The biggest Supermoon of 2022 will be visible on July 13 as it comes to the closest point to Earth

ప్రతి సంవత్సరం అపోజీ, పెరిజీలు ఏర్పడుతుంటాయనే విషయం తెలిసిందే. భూమి చుట్టూ చంద్రుడి పరిభ్రమిస్తోండటం వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. ఈ పరిభ్రమణంలో భాగంగా చంద్రుడు భూమి కక్ష్యకు అత్యంత సమీపానికి రావడాన్నిపెరీజీగా, అత్యంత దూరంగా వెళ్లడాన్ని అపోజీగా పిలుస్తుంటారు అంతరిక్ష పరిశోధకులు. అపోజీ ఏర్పడినప్పుడు భూమికి-చంద్రుడికి మధ్య ఉండే దూరం 4,05,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పెరిజీ సమయంలో ఈ దూరం 3,57,256 కిలోమీటర్లుగా ఉంటుంది.

అర్ధరాత్రి 12:07 నిమిషాలకు చంద్రుడు పీక్ పాయింట్‌కు చేరుకుంటాడని, ఆ సమయంలో అత్యంత ప్రకాశంతంగా కనిపిస్తాడని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. సాధారణ పున్నమి రోజుల్లో కంటే పెరీజీ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం మేర అధిక ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి నాసా సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఇలాంటి అద్భుతాలన్నింటినీ నాసా తన అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటుంది.

English summary
The biggest Supermoon of 2022 will be visible on July 13 as it comes to the closest point to Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X