Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ చర్చిలో 40వేల ఆస్థిపంజరాలు!(వీడియో)

పరాగ్వే: ఆ చర్చిని చూస్తే భయాందోళనలకు గురికావాల్సిందే. ఎందుకంటే ఆ చర్చి నిండా ఆస్థిపంజరాలే ఉంటాయి. చర్చి నిర్మాణంలో భాగమైనట్లు ఉండే ఆ ఆస్థిపంజరాలను చూస్తే ఎవ్వరైనా కొంత భయానికి గురికావాల్సిందే.

అయితే భయం కలిగించడంతోపాటు అవి ఎంతో ఆకట్టుకునేలా నిర్మాణంలో భాగం చేశారు. సుమారు 40వేల ఆస్థిపంజారాలతో నిర్మించిన ఆ చర్చిని చూడాలంటే చెక్ రిపబ్లిక్ దేశంలోని సెడ్లాక్‌కు వెళ్లాల్సిందే.

1278వ సంవత్సరంలో సెడ్లాక్‌కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం వెళ్లాడు. అతను అక్కడి మట్టిని తెచ్చి ఆ ఊళ్లో చల్లాడు. ఆ పవిత్ర స్థలం శ్మశాన వాటికగా మారింది. దీంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పుడే యూరోప్ అంతా ప్లేగ్ ప్రబలింది.

The Bone Church Made Of 40,000 Skeletons Will Give You Chills

ఆ వ్యాధి వల్ల 30వేల మంది బలయ్యారు. వాళ్లను ఇక్కడే పూడ్చారు. ఆ తర్వాత మతయుద్ధాల వల్ల సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు. వాళ్లను కూడా అక్కడే పాతిపెట్టారు. కాగా, 15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం శవాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని తవ్వారు. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు.

ఆ తర్వాత స్థానిక శిల్పితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో ఎముకలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పుర్రెల దండలు చర్చి సందర్శకులను ఆహ్వానిస్తాయి. ఇక వెన్నుపూసలతో చేసిన శాండిలీర్ ఆ చర్చికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చర్చికి బోన్ చర్చి అనే పేరు కూడా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+