Canada: విదేశీయులకు షాక్ ఇచ్చిన కెనడా.. ఇక ఆ పని చేయడం కష్టమే..!
కెనడాలో ఉండే విదేశీయులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తమ దేశంలో విదేశీయులు నివాస స్థలాలు కొనుగోలు చేయకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఈ నిబంధన జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. కెనడాలో స్థానికులకు ఇళ్లు దొరగడంలేదు. దీంతో విదేశీయులు ఇళ్లు కొనకుండా ఉండేందుకు రెండేళ్ల పాటు నిషేధం విధించారు.

గృహాలకు మాత్రమే
ఈ నిషేధం కేవలం గృహాలకు మాత్రమే వస్తుందని తెలిపింది. వేసవి కాటేజీల వంటి వినోద ఆస్తులకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. 2021 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ తాత్కాలిక రెండేళ్ల నిషేధాన్ని ప్రతిపాదించారు. కెనడియన్లకు అందుబాటులో లేకుంజా ధరలు పెరిగినప్పుడు ట్రూడో ఈ హామీ ఇచ్చారు.

రియాల్ ఎస్టేట్
"కెనడాలో రియాల్ ఎస్టేట్, గృహాల నిర్మణం, అమ్మకం సంపన్న సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులకు లాభాదాయకంగా ఉంది" అని లిబరల్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిచింది. కెనడియన్లకు ఇళ్లు దొరకాలంటే తాత్కాలిక నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. 2021 ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికైన ట్రూడో విదేశీయులు ఇల్లు కొనడాన్ని నిషేధించారు.

బ్యాంక్ ఆఫ్ కెనడా
కెనాడలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు బ్యాంక్ ఆఫ్ కెనడా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ బిసినెస్ కాస్త తగ్గింది. కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రకారం, సగటు ఇంటి ధరలు 2022 ప్రారంభంలో Can$800,000 (US$590,000) కంటే ఎక్కువ గరిష్ట స్థాయి నుంచి గత నెలలో కేవలం Can$630,000 (US$465,000)కి పడిపోయాయి.

19 మిలియన్ హౌసింగ్ యూనిట్లు
జాతీయ గణాంక ఏజెన్సీ ప్రకారం కెనడాలో గృహ యాజమాన్యంలో ఐదు శాతం కంటే తక్కువ ఉన్న విదేశీ కొనుగోలుదారులపై నిషేధం విధించడం వల్ల గృహాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కెనడా మార్ట్‌గేజ్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్, నేషనల్ హౌసింగ్ ఏజెన్సీ జూన్ నివేదికలో 2030 నాటికి దాదాపు 19 మిలియన్ హౌసింగ్ యూనిట్లు అవసరమవుతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications