Sudan: ఐదుగురి భారతీయులను రక్షించిన ఫ్రెంచ్ దళాలు..
సూడాన్‌లో యుద్ధంలో చిక్కుకుపోయిన భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత్ 'ఆపరేషన్ కావేరీ' ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం 'ఆపరేషన్ కావేరి' ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారని మరికొంత మంది మార్గ మధ్యలో ఉన్నారని మంత్రి చెప్పారు.
ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం, సూడాన్‌లో దాదాపు 2,800 మంది భారతీయ పౌరులు ఉన్నారు. దాదాపు 1,200 మంది అక్కడ స్థిరపడిన వారున్నారు. ఫ్రెంచ్ వైమానిక దళం విమానం ద్వారా ఇప్పటివరకు ఐదుగురు భారతీయ పౌరులన రక్షించారు. వీరితో పాటు 28 మందికి పైగా ఇతర దేశాల వ్యక్తులతో పాటు జిబౌటిలోని ఫ్రాన్స్ సైనిక స్థావరానికి తీసుకువచ్చినట్లు ఫ్రెంచ్ దౌత్య వర్గాలు తెలిపాయి. మూడు విమానాలు సుమారు 500 మంది తరలింపులను ఫ్రాన్స్ సైనిక స్థావరానికి తీసుకువచ్చాయని తెలిసింది.

భారత నావికాదళానికి చెందిన INS సుమేధ పోర్ట్ సూడాన్‌లో ఉందని అధికారులు తెలిపారు. ఈ యుద్ధనౌక గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన స్టీల్త్ ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక అని, ఆధునిక ఆయుధాలు, సెన్సార్‌లతో అమర్చిన నౌకగా దీన్ని పేర్కొన్నారు. ఫ్రాన్స్ కూడా తరలింపు కార్యకలాపాలను ప్రారంభించింది. IAFలోకి C-17, C-130 విమానాలను ఇండక్షన్ చేయడం వల్ల భారత్ గ్లోబల్ HADR (మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం) రీచ్‌ను అసాధారణంగా పెంచామని, కోవిడ్-19 సహాయ కార్యకలాపాలలో ఇది ప్రదర్శించబడిందని ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా (రిటైర్డ్) డైరెక్టర్ చెప్పారు.
"మా రాయబార కార్యాలయం సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంది. సురక్షితమైన కదలికల సాధ్యత, అనవసరమైన ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం గురించి వారికి సలహా ఇస్తోంది."అని MEA ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సూడాన్ లో చిక్కుకున్న తమ పౌరులను రక్షించుకోవడానికి ఇప్పటికే సౌదీ అరేబియా, యుఎఇ, యుఎస్ మరియు యుకె రంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications