Paramjit Panjwar: పాక్‍లో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ హతం..
వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కెసిఎఫ్) చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్‌ను శనివారం ఉదయం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో కాల్చి చంపారు. ముష్కరుల కాల్పుల్లో పంజ్వార్ మరణించినట్లు రాడికల్ సిక్కు సంస్థ దాల్ ఖల్సా నాయకుడు కన్వర్ పాల్ సింగ్ ధృవీకరించారు. "మా సమాచారం ప్రకారం, అతను మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఇద్దరు ముష్కరులు అతనిని కాల్చి చంపారు" అని కన్వర్ పాల్ చెప్పారు. పాక్ ప్రభుత్వం తనకు అందించిన పంజ్వార్ గన్‌మ్యాన్ ముష్కరులపై కాల్పులు జరిపాడని, వారిలో ఒకరు చనిపోయారని, మరొకరు గాయపడ్డారని ఆయన తెలిపారు.
1960లో తార్న్ తరణ్‌లోని పంజ్వార్ గ్రామంలో జన్మించిన పరమజిత్ సింగ్ పంజ్వార్ KCFలో కీలక నాయకుడిగా ఉన్నాడు. KCF చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో దీన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించారు. పరమజిత్ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్నాడు. అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. దాల్ ఖల్సా 2020లో విడుదల చేసిన నానాక్షహి క్యాలెండర్‌లో పంజ్వార్ చిత్రాన్ని కూడా ప్రచురించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకారం, "పంజ్వార్ పాకిస్తాన్‌లోని యువకులకు ఆయుధ శిక్షణను ఏర్పాటు ఇచ్చాడు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడు. ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం కోసం భారతదేశంలోకి చొరబడ్డాడు. అతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన అత్యంత విద్రోహ, వేర్పాటువాద కార్యక్రమాలను రేడియో పాకిస్తాన్‌లో ప్రసారం చేస్తున్నాడు. భారత పంజాబ్‌లోకి డ్రోన్‌లను ఉపయోగించి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు.
1990వ దశకంలో లబ్ సింగ్‌ను భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత, పంజ్వార్ కేసీఎఫ్‌ను హస్తగతం చేసుకుని పాకిస్తాన్‌కు పారిపోయాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పంజ్వార్.. సరిహద్దు ఆయుధాల స్మగ్లింగ్, హెరాయిన్ ట్రాఫికింగ్ ద్వారా ఆర్థికంగా సంపాదించడం ద్వారా కేసీఎఫ్‌ని మరింత బలోపేతం చేశాడు. పాకిస్తాన్ తన భూభాగంలో తన ఉనికిని తిరస్కరించినప్పటికీ, పంజ్వార్ లాహోర్‌లోనే ఉన్నాడు. అతని భార్య, పిల్లలు జర్మనీకి వెళ్లారు.
"మాజీ మిలిటెంట్లు, స్లీపర్ సెల్స్, బెయిల్‌లో ఉన్న వారిని రియాక్టివ్ చేయడానికి అతని KCF ప్రయత్నాలు చేస్తోంది. "హింసాత్మక మార్గాలు/సాయుధ పోరాటం ద్వారా ఖలిస్తాన్‌ను సృష్టించే లక్ష్యంతో ఫిబ్రవరి 1986లో KCF ఉనికిలోకి వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడానికి విమోచన క్రయధనం కోసం బ్యాంకు దోపిడీలు/కిడ్నాప్‌లు చేయడం ఈ సంస్థ వృత్తిగా ఉండేది.
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications