రూ. 2 లక్షల కోట్లు దానం చేసిన యువరాజు

సౌదీ: సౌదీ అరేబియా యువరాజు ప్రజలు క్షేమంగా సుఖసంతోషాలతో ఉండాలని కలలుకంటున్నారు. ఆ కల నెరవేరడానికి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న రూ. రెండు లక్షల కోట్ల ఆస్తిని సమాజసేవకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన ఔదార్యాన్ని చూపించారు. రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని చారిటీ ట్రస్టుల ద్వారా సమాజసేవకు వినియోగించాలని వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్దికి, మహిళల సాధికారతకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

The money will go to the prince's charitable organisation

అంతేకాకుండా విపత్తు సహాయానికి ఈ నిధులు ఉపయోగిస్తామని ప్రకటించారు. అమెరికాలోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరహాలో తన చారిటీ ట్రస్టు ఎర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చారిటీ ట్రస్టు బోర్డులకు యువరాజు అల్వలీద్ చైర్మన్ గా పని చేస్తారు.

అల్వలీద్ కింగడమ్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ యాజమాన్యం వాటాలు కాకుండా మిగిలిన సంపదను సమాజసేవకు వినియోగిస్తున్నారు. సౌదీ రాజు అబ్దుల్లా మరణించిన విషయం తెలిసిందే. సౌదీ రాజు అబ్దుల్లాకు ఈ యువరాజు అల్వలీద్ సమీప బంధువు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+