US Elections: ప్రవాస భారతీయుల మద్దతెవరికి - ఇదీ లెక్క..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పై ఉత్కంఠ పెరుగుతోంది. మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. ఓటింగ్ కోసం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మంది తమ ఓటు వినియోగించు కున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓటింగ్ కీలకంగా మారింది. వీరి మద్దతు కోసం ఇద్దరు ప్రధాన అభ్యర్ధులు పోటీ పడి హామీలు ఇచ్చారు. ఇంతకీ ప్రవాస భారతీయు ల్లో మెజార్టీ మద్దతు దక్కేదెవరికి. సర్వే సంస్థల అంచనాలేంటి.
ఇద్దరిలో ఎవరి వైపు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా ట్రంప్- కమలా హారీస్ పోటీ పడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర కీలకంగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో వారి మద్దతు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నారు. సర్వే సంస్థల రిపోర్ట్స్ లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో..ఇరు పార్టీలు వీరి మద్దతు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాలోని జార్జియా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో అక్కడ వారి మద్దతు కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఆ రాష్ట్రాల్లో కీలకంగా
డెమోక్రటిక్ పార్టీ నుంచి భారతీయ కుటుంబ మూలాల నుంచి వచ్చిన ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీ చేస్తున్నారు. దీంతో, ప్రవాస భారతీయుల మెజార్టీ మద్దతు కమలాకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆసక్తి కర అంశాలు సర్వేల్లో వెలుగులోకి వస్తున్నాయి. కమలా అభ్యర్దిత్వం పైన ప్రవాస భారతీయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ట్రంప్ పని తీరు..వ్యవహార శైలి పైన పూర్తి అవగాహన ఉండటంతో మద్దతు పైన ఆచి తూచి స్పందించారు. తాజాగా హిందువుల పైన బంగ్లాదేశ్ వంటి చోట్ల జరుగుతున్న దాడుల పైన ట్రంప్ స్పందించటం కూడా ఓటింగ్ సరళి పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత్ - అమెరికా మధ్య సంబంధాల విషయంలోనూ డెమోక్రాట్ అధ్యక్షుల సమయంలోనే పురోగతి ఉందనే అభిప్రాయం కనిపిస్తోంది.
సర్వే లెక్కలతో
ఓటింగ్ కు కొన్ని గంటల ముందు ఆసక్తి కర సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు భారతీయ అమెరికన్లలో మెజార్టీ మద్దతు కమలా కు అనుకూలంగా కనిపించింది. కానీ, పోలింగ్ దగ్గర పడుతున్న వేళ అనూహ్యంగా ట్రంప్ కు మద్దతిచ్చే వారి సంఖ్య పెరిగినట్లు తాజా సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, మహిళా ఓటర్లు మాత్రం కమలా వైపే మొగ్గు చూపుతున్న ట్లు స్పష్టం అవుతోంది. నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు 22 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటేసారు. ఆ ఎన్నికల్లో జో బైడెన్‌కు 68 శాతం మంది మద్దతు తెలిపారు. 2024 ఇండియన్-అమెరికన్ యాటిట్యూడ్స్‌పేరుతో వెల్లైన అంచనాల ప్రకారం భారతీయ అమెరికన్ మహిళల్లో 67 శాతం కమలా హరీస్ కు మద్దతుగ నిలిచారు. కాగా, పురుషుల్లో 53 శాతం హారీస్ కు ఓటు వేస్తామని వెల్లడించారు దీంతో.. ఓటింగ్ లో భారతీయ అమెరికన్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications