వజ్రాలు పొదిగి, కళ్లు మిరిమిట్లు గొలుపుతున్న విమానం, అసలు కథ ఇదీ!
దుబాయ్: ఇటీవల ఎమిరేట్స్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎమిరేట్ ఎయిర్ లైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఈ నెల 4వ తేదీన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో వజ్రాలతో పొదిగిన ఓ విమానాన్ని ట్వీట్ చేసింది.
నెటిజన్ల కన్ఫ్యూజన్
ఇది నెటిజన్లను గందరగోళంలో పడేసింది. ఇది ఎమిరేట్స్ వజ్రాలతో పొదిగిన విమానమా? ఇది నిజమేనా? లేక వట్టిదేనా? అనే సందేహం పలువురి నెటిజన్లలో కలిగింది. సారా షకీల్ క్రియేట్ చేసిన ఇమేజ్ ఇది, దీనిని ఎమిరేట్స్ బ్లింగ్ 777 సమర్పిస్తోందంటూ ఓ ట్వీట్ చేసింది.

నిజమైనదా
ఎమిరేట్స్ విమానం పైన పూర్తిగా వజ్రాలు పొదిగి ఉన్నాయి. వెలుగులు విరజిమ్ముతోంది. దీనిని ఎమిరేట్స్ ట్వీట్ చేయడంతో నెటిజన్ల.. ఇది నిజమా లేక అబద్దమా అని స్పందించారు. మీరు ఫిజిక్స్, ఏరో డైనమిక్స్ ప్లే చేస్తున్నారా అని ఓ నెటిజన్ స్పందిస్తే, ఇది నిజమైనదా అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. కానీ ఇచ్చిన క్యాప్షన్‌లోనే ఎమిరేట్స్ అసలు విషయం చెప్పేసింది. అది నిజమైనది కాదని, వజ్రాలతో పొదిగినదని అని వెల్లడించింది. కానీ నెటిజన్లు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారు.

అనుమతి తీసుకొని పోస్ట్
ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రకారం... సారా షకీల్ ఓ క్రిస్టల్ ఆర్టిస్ట్. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సారా షకీల్ తన ఆర్ట్ వర్క్‌ను మంగళవారం రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ దృష్టిలో పడింది. సారా షకీల్ అనుమతి తీసుకొని, దానిని తాము రీపోస్ట్ చేస్తామని ఎమిరేట్స్ తెలిపింది. దానికి ఆమె అంగీకరించారు.
ఆసక్తిక పోస్టులు
క్రిస్టల్ ఆర్టిస్ట్ సారా షకీల్ క్రియేట్ చేసిన పిక్‌ను తాము పోస్ట్ చేశామని ఎమిరేట్స్ అధికార ప్రతినిధి ఒకరు గల్ఫ్ న్యూస్‌కు తెలిపారు. ఇది నిజమైనది కాదని చెప్పారు. ఈ ట్వీట్‌కు వేలాది మంది తమదైన శైలిల్లో స్పందిస్తున్నారు. ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. నా పోస్ట్ ఇంత వైరల్ అవుతుందని తాను అనుకోలేదు దేవుడా.. అంటూ సారా షకీల్ పోస్ట్ చేశారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications