వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో జాగ్రత్త - దాడులకు ఛాన్స్ : పౌరులకు అమెరికా హెచ్చరిక..!!

|
Google Oneindia TeluguNews

భారత్ లో తమ దేశ పౌరులు పర్యటించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. నేరాలతో పాటుగా ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్ లో పర్యటన వేళ మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. ప్రధానంగా జమ్ము కాశ్మీర్ ప్రాంతానికి మాత్రం వెళ్లవద్దని అమెరికా సూచించింది. భారత్ - పాకిస్థాన్ సరిహద్దులకు పది కిలోమీటర్ల మేర ప్రాంతాల్లో అసలు పర్యటించవద్దని స్పష్టం చేసింది. అక్కడ సైనిక ఘర్షణలకు అస్కారం ఉందని అలర్ట్ చేసింది.

పర్యాటక ప్రదేశాలతో పాటుగా రవాణా, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తో పాటుగా ప్రభుత్వ ప్రాంగణాల పైన ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. తమ దేశంలో అత్యాచారణ ఘటనలు పెరుగుతున్నాయని భారత అధికారులు చెబుతున్నారంటూ అమెరికా జాతీ చేసిన అడ్వయిజరీలో పేర్కొంది.

టూరిజం ప్రాంతాలతో పాటుగా ఇతర ప్రదేశాల్లో లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయంటూ భారత్ తెలిపిందని వివరించింది. అమెరికా జారీ చేసిన ట్రావెల్ అడ్వయిజరీ లో అనేక మార్గదర్శకాలు - సూచనలు చేసింది. భారత్ లో ముప్పు స్థాయిని లెవలం - 2కు తగ్గించింది. ఇందులో లెవల్ -2 గరిష్ఠ స్థాయిగా పరిగణిస్తారు.

The US asked its citizens to exercise increased caution while travelling to India due to crime and terrorism

దీనికి ముందు పాక్ ను లెవల్ -3 గా అమెరికా పరిగణించింది. ఆ దేశాన్ని సందర్శించే అంశం పై పునరాలోచన చేయాలని తమ పౌరులకు సూచించింది. ప్రధానంగా కల్లోలిత ప్రావిన్స్ లకు వెళ్లవద్దని అమెరికా తమ దేశ పౌరులకు స్పష్టం చేసింది. ఇక, తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాఱ రెంయి బెంగాల్ లోని పశ్చిమ ప్రాంతం వరకు తమ పౌరులకు అవసరమైన సమయంలో అత్యవసర సేవలు అందించే సామర్ధ్యం అమెరికా ప్రభుత్వానికి పరిమితమని ఈ అడ్వయిజరీలో వివరించింది.

తమ ఉద్యోగులు అక్కడకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. సూచనలతో పాటుగా పరిస్థితులను వివరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రయాణ సూచనలతో ఇప్పుడు భారత్ లోని అమెరికా పౌరులను మరింత అప్రమత్తత చేసినట్లు కనిపిస్తోంది.

English summary
The United States issued an advisory for its citizens asked them to exercise increased caution while travelling to India in the wake of crime and terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X