నియంత నోట..యుద్ధం మాట: సెకెండ్ కొరియన్ వార్: మా బలాలు అవే: జోలికి రావట్లేదు
ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ నోట.. యుద్ధం మాట వినిపించింది. కొరియన్ వార్.. న్యూక్లియర్ వెపన్స్ వంటి పదాలు ఆయన నోటి వెంట వెలువడ్డాయి. అణ్వస్త్రాలను కలిగి ఉన్న శక్తిమంతమైన దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించిందని, అందుకే తమ జోలికి ఎవరూ రావట్లేదని అన్నారు. ఈ పరిస్థితి ఏర్పడినందుకు న్యూక్లియర్ వెపన్లకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

కొరియన్ వార్ వార్షికోత్సవంలో..
1950-53 మధ్య కొనసాగిన కొరియన్ వార్ ముగిసి సోమవారం నాటికి 67 సంవత్సాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆర్మీ ఉన్నతాధికారులు, కొరియన్ యుద్ధంలో పాల్గొన్న వెటరన్స్‌తో కిమ్‌జొంగ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికా సైతం తమ జోలికి రావడానికి వెనుకాడుతోందని పరోక్షంగా చెప్పారు.

అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా..
దీనికి ప్రధాన కారణం- అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా ఎదగడమే ప్రధాన కారణమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అణ్వస్త్రాలను కలిగి ఉండటం ఒకరకంగా మంచిదేనని కిమ్ వ్యాఖ్యానించారు. యుద్ధమంటూ ఏర్పడితే అణ్వస్త్రాలను వినియోగించాల్సిన అవసరం తప్పక వస్తుందని, అది వినాశనాన్ని సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. న్యూక్లియర్ వెపన్స్ మిగిల్చే విధ్వంస పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం వల్లే ఏ ఒక్క దేశం కూడా యుద్ధానికి సన్నద్ధం కావట్లేదని అన్నారు.

దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవడానికే
దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం వైపే మొగ్గు చూపుతున్నారని కిమ్‌జొంగ్ చెప్పుకొచ్చారు. సెకెండ్ కొరియన్ వార్ ఆవిర్భవించకపోవడానికి న్యూక్లియర్ వెపన్లే ప్రధాన కారణమని కిమ్ వ్యాఖ్యానించారు. యుద్ధాలను నివారించగలిగే శక్తి న్యూక్లియర్ వెపన్లకు ఉన్నాయనే విషయాన్ని తాను నమ్ముతున్నానని అన్నారు. తమతో యుద్ధానికి కాలుదువ్వే సాహసం పొరుగు దేశం చేయట్లేదని ఆయన దక్షిణ కొరియాను పరోక్షంగా ఉటంకించారు. అత్యంత శక్తిమంతం, అత్యాధునికమైన అణ్వస్త్రాలు దేశానికి రక్షణగా నిలిచాయని ఎలాంటి శక్తులనైనా ఎదిరించేలా ఉత్తర కొరియాను తయారు చేశాయని అన్నారు.
Recommended Video

అత్యాధునిక అణ్వస్త్రాలు..
సమీప భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం ఏర్పడే అవకాశమే లేదని చెప్పారు. తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌జొంగ్ ఉన్ మధ్య ఈ ఏడాది ఎలాంటి సమావేశాలు ఉండబోవంటూ కొద్దిరోజుల కిందటే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2018 తరువాత వారిద్దరి మధ్య ఈ ఏడాది మరోసారి భేటీ కావాల్సి ఉంది. దీన్ని రద్దు చేయడం ఒకరకంగా కిమ్‌జొంగ్‌కు అసహనాన్ని తెప్పించిందని, అందుకే అమెరికాను సైతం ఆయన పరోక్షంగా విమర్శించి ఉండొచ్చని చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications