Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓర్లాండో ఫైరింగ్ దాకా.. వ్యక్తి జోస్యం, అంతా చెప్పినట్లే..

వాషింగ్టన్: భవిష్యత్తును ముందే ఊహించి అతడు చెప్పినట్లు పలు సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి విన్నాం. నోస్ట్రడోమస్ గురించి విన్నాం. కానీ, పాబ్లో రాయిస్ అనే వ్యక్తి ఇటీవలి కాలంలో ఓ జోస్యం చెప్పాడు.

అమెరికాలో ఆయన చెప్పినట్లుగా కొన్ని జరుగుతుండటం గమనార్హం. పాబ్లో రేయిస్ గత డిసెంబర్ నెల 27వ తేదీన అమెరికాలో ఏం జరగనుందో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.

దిగ్గజ బాక్సర్ మహమ్మద్ అలీ, పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మరణాలు, ఓర్లాండో కాల్పులు తదితరాలను ఆయన ముందే ఊహించాడు. అంతేకాదు, అమెరికాకు హిల్లరీ క్లింటన్ తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని పేర్కొన్నాడు.

అమెరికాలో భారీ కాల్పులు చోటు చేసుకుంటాయని చెప్పాడు. ఇటీవలే ఓర్లాండో కాల్పులు చోటు చేసుకున్నాయి. గోరిల్లా మరణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాడు.

అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ చనిపోతాడని కూడా పోస్ట్ పెట్టాడు. తాను ఎవరినో భయపెట్టేందుకు ఈ విషయాలు చెప్పడం లేదని, తన పేరును అందరు గుర్తు పెట్టుకోవాలని ఈ విషయాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన పోస్ట్‌ను లక్షలాది మంది చూశారు. చూస్తున్నారు.

This man fooled 2 lakh people on Facebook with his ‘predictions’, here’s how

డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

ముస్లిం వ్యతిరేకి అని రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శించడంతో, తిరిగి ట్రంప్‌.. ఒబామాపై విమర్శలకు దిగారు. ట్రంప్‌ మాట్లాడుతూ.. ఓర్లాండోలో మారణహోమం సృష్టించిన మతీన్‌పై కంటే కూడా తన పైనే ఒబామా ఎక్కువ కోపంగా ఉన్నారని అన్నారు.

నార్త్‌కెరోలినాలోని గ్రీన్స్‌బోరో ప్రాంతంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ ఒబామాను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఒబామాకు తనపై కోపం ఏ స్థాయిలో ఉందో, ఆ స్థాయిలో ఓర్లాండో షూటర్‌పై కోపం ఉండాల్సిందన్నారు. అమెరికా రాడికల్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదం సమస్యతో బాధపడుతోందని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+