• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏమి ఆఫర్ గురూ: బికినీలు ధరించి వస్తే ఫ్రీ పెట్రోల్.. క్యూకట్టిన వాహనదారులు

|

రష్యా: పెట్రోలు ఉచితంగా ఇవ్వడమంటే మాటలు కాదు. కానీ అక్కడ మాత్రం పెట్రోలు ఉచితంగానే ఇస్తాము అది కూడా వాహనంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొడతామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే కండీషన్స్ అప్లయ్ అనే బోర్డును పెట్టింది. కండీషన్స్‌ ఏముందిలే... పెట్రోల్ ముఖ్యం అనుకున్న వారు ఆ పెట్రోల్ బంకు ముందు బారులు తీరారు. ఇంతకీ ఆ పెట్రోల్ బంకు ఎక్కడుంది..? వారిచ్చిన ఆఫర్ ఏంటి.. ఆ కండీషన్స్ ఏంటి..?

 అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన పెట్రోల్ బంక్

అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన పెట్రోల్ బంక్

రష్యాలోని సమారా ప్రాంతంలో ఉన్న ఓల్వీ అనే ఓ పెట్రోల్ బంకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఉచితంగా పెట్రోల్ పడతామని చెప్పడంతో పౌరులు వాహనాలతో బారులు తీరారు. అయితే వారంతా ఓ వైరైటీ గెటప్‌లో కనిపించారు. ఇదేంటి అంతా ఇలాంటి గెటప్‌లో పెట్రోల్ బంకు ముందు క్యూకట్టారని ప్రశ్నించగా... ఈ గెటప్‌లో వస్తేనే పెట్రోలు ఉచితమనే షరతు ఆ బంకు యాజమాన్యం పెట్టిందట. ఇంతకీ ఆ గెటప్‌ ఏంటో తెలిస్తే నోళ్లెల్లబెడతారు.

 బికినీ ధరిస్తే చాలు..ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫ్రీ

బికినీ ధరిస్తే చాలు..ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫ్రీ

ఇక పెట్రోలు ఫ్రీగా ఇస్తున్న ఆ బంకు యాజమాన్యం పెట్టిన కండీషన్ ఏంటంటే ఎవరికైనా సరే అది ఆడవారైనా మగవారైనా తమ బంకు నుంచి ఉచితంగా పెట్రోలు కావాలంటే బికినీ ధరించి పెట్రోల్ బంకులోకి రావాలని కండీషన్ పెట్టింది. ఆ.. పోయేదేముంది రెండు నిమిషాలు బికినీ ధరించి పెట్రోల్ బంకుకు వెళితే ఫుల్ ట్యాంకు పెట్రోల్ పట్టుకోవచ్చని భావించిన మగవారు వారి దగ్గర బికీనీలు లేకున్నప్పటికీ వారింట్లో ఉన్న ఆడవాళ్ల బికినీలు ధరించి ఓల్వీ పెట్రోల్ బంకు ముందు క్యూ కట్టారు. మరి కొంతమంది మగవారైతే కలర్‌ఫుల్ బికినీలు, హైహీల్స్ ధరించి పెట్రోల్ కోసం ఓల్వీ పెట్రోల్ బంకుదగ్గరకు చేరారు.

 కలర్‌ఫుల్ బికినీస్‌తో దర్శనమిచ్చిన మగవారు

కలర్‌ఫుల్ బికినీస్‌తో దర్శనమిచ్చిన మగవారు

కలర్‌ఫుల్ పెట్రోల్‌బంకుల ముందు బికినీలు ధరించి వయ్యారాలు పోతూ తమ వాహనాల్లో పెట్రోల్ పట్టించుకుంటున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఒక్కసారిగా బికినీ బాబుల సంఖ్య క్షణంక్షణంకు పెరిగిపోతుండటంతో ఆలోచనలో పడ్డ బంకు యజమాని సమయంను మూడుగంటకు కుదించారు. అంటే మూడుగంటల వరకే ఆఫర్ అని బోర్డు పెట్టేశాడు. మొత్తానికి ఈ ఆఫర్‌తో ఆయన పెట్రోల్ బంకు పేరు మారుమోగిపోవడమే కాదు కాసుల పంట కూడా కురించింది.

 డబ్బులకు డబ్బులు..పబ్లిసిటీకి పబ్లిసిటీ

డబ్బులకు డబ్బులు..పబ్లిసిటీకి పబ్లిసిటీ

సాధారణంగా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు వినూత్న పద్ధతులను పాటిస్తుంటారు. కానీ ఈస్థాయిలో మార్కెటింగ్ చేసుకునేందుకు క్రియేటివిటీ చాలా ఉపయోగించారు. బికినీ ఆఫర్‌ పై విమర్శలు వచ్చినప్పటికీ యజమాని అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆఫర్ ప్రకటించగానే తండోపతండాలుగా బికినీ బాబులు పెట్రోల్‌ కోసం క్యూకట్టేశారు. అంతేకాదు వారికి ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందనే పాజిటివ్‌గా చెప్పారు. ఇది ఇప్పుడు కొత్తగా వింటున్నది కాదు. గతంలో కూడా ఉక్రెయిన్‌లోని ఓ పెట్రోల్ పంపు కూడా ఇలాంటి బికినీ ఆఫర్‌నే ప్రకటించినప్పటికీ ఈ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఫెయిల్ అయ్యింది.

English summary
The Olvi gas station in Samara, Russia promised free fuel to anyone who turned up in a bikini. They probably thought that a lot of women will turn up, but they clearly didn't think things through.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X