అంతరిక్షంలో 196 రోజుల మిషన్ పూర్తి - క్షేమంగా భూమికి చేరిన ముగ్గురు వ్యోమగాములు - వీడియో
ప్రత్యేక మిషన్ కోసం అంతరిక్షంలో 196 రోజులపాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. బుధవారం రాత్రి 7:32 గంటలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన వ్యోమగాములు అదేరోజు రాత్రి 10:54 గంటలకు కజకిస్తాన్లోని డెజ్కాజ్గాన్ పట్టణానికి సమీపంగా సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
ఈ మిషన్ లో పాల్గొన్న ముగ్గురు వ్యోమగాముల్లో ఒకరు అమెరికన్ కాగా, మిగతా ఇద్దరు రష్యన్లు. నాసా వ్యోమగామి క్రిస్ కాసిడీ, రష్యన్ వ్యోమగాములు ఇవాన్ వాగ్నెర్, అనాటోలీ ఇవానిషిన్ భూమికి తిరిగి చేరిన వెంటనే సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.

ల్యాండింగ్ సైట్ వద్ద ప్రాథమిక వైద్య తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. క్రిస్ కాసిడీ నాసా విమానంలో హ్యూస్టన్‌కు.. వాగ్నెర్, ఇవానిషిన్ రష్యాలోని స్టార్ సిటీకి వెళ్లనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలల మిషన్ సందర్భంగా.. కాసిడీ ఎక్స్‌పెడిషన్ 63 కమాండర్‌గా పనిచేశారు.
స్టేషన్ బ్యాటరీలను అప్‌గ్రేడ్ చేయడానికి కాసిడీ, బెహ్ంకెన్ మొత్తం 23 గంటలు 37 నిమిషాలపాటు నాలుగు స్పేస్‌వాక్‌లను పూర్తి చేశారు. 10 అంతరిక్ష నడకలను పూర్తి చేసిన నలుగురు అమెరికా వ్యోమగాములలో వీరు కూడా ఉన్నారు. కాసిడీ స్పేస్ లో మొత్తం 378 రోజులు గడపడం ద్వారా ఎక్కువకాలం అక్కడున్న యూఎస్ వ్యోమగాముల్లో ఐదో వ్యక్తిగా నిలిచారు.













Click it and Unblock the Notifications