Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాల్ గర్ల్‌తో ప్రేమలో పడ్డ టైగర్ మెమెన్, భార్యకూ...

ముంబై: యాకూబ్ మెమెన్ సోదరుడు, 1993 బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు టైగర్ మెమెన్ ఓ కాల్ గర్ల్‌తో ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. అతను ఓ దశలో తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

ముంబై పేలుళ్లకు ముందు టైగర్ మెమెన్ ఎన్నో వేశ్యా గృహాలకు వెళ్లేవాడని, ఓ గృహంలో ఉన్న యువతిని ఎంతో ప్రేమించాడని, ఆమె కోసం తన స్మగ్లింగ్ వ్యాపారానికి స్వస్తి చెప్పాలని భావించినట్లు తెలుస్తోంది. టైగర్ మెమెన్ ప్రేమించిన యువతినే మరో వ్యక్తి కిషన్ కూడా కోరుకున్నాడట.

ఆమెకు, టైగర్ మెమెన్‌కు మధ్య ఉన్న బంధాన్ని తెలుసుకుని ఆ మరో వ్యక్తి సజీవ దహనం చేసుకోబోయాడని, కిషన్ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకున్న ఆమె, అప్పటి నుంచి టైగర్ మెమెన్‌ను దూరం పెట్టిందని పేర్కొన్నారు.

Tiger was in love with a call girl

1993 బాంబు పేలుళ్ల అనంతరం టైగర్ మెమెన్ ముంబై నుంచి దుబాయ్ పారిపోయారు. మార్చి 12, 1993లో ముంబై పోలీసులు వర్లీలోని ఆ కారులో బాంబులను గుర్తించారు. ఆ కారు మెమెన్ ఇష్టపడిన కాల్ గర్ల్ పేరిటే రిజిస్టరై ఉందని పేర్కొన్నారు.

పోలీసులు ఆమెను అరెస్టు చేసి, మెమెన్ గురించి సమాచారం సేకరించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ముకదమ్, షానవాజ్ ఖురేషీలను అదుపులోకి తీసుకున్నారు. ప్లాజా సనిమా వద్ద పెట్టిన బాంబు కేసులో వీరని టాడా కోర్టు దోషులుగా తేల్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+