షాక్: భర్తతో గొడవ, కారు దిగిన భార్యను లాక్కెళ్లి చంపిన పులి

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: వైల్డ్ లైఫ్ పార్కులో.. కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన కారు డ్రైవింగ్ సీటు నుంచి దిగి, మరో డోర్ తెరిచింది. అదే సమయంలో ఊహించని విధంగా, వెనుక నుంచి పులి వచ్చి ఆమెను ఎత్తుకెళ్లింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు గాయపడ్డారు. ఆమె మృతి చెందింది.

ఈ సంఘటన చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌కు సమీపంలోని బడాలింగ్ వైల్డ్ పార్క్ వద్ద జరిగింది. సదరు మహిళ కారు ఆపిన ప్రదేశం వన్య ప్రాణులు బాగా తిరిగే ప్రదేశం. ఆ చుట్టుపక్కల కార్లు ఉన్నాయి. పార్కు నుంచి పులి ఎలా బయటకు వచ్చిందో.. కానీ ఆమె మృత్యువాత పడింది.

Tigers maul woman to death and wound another at Chinese wildlife park

ఈ పార్కులో కేవలం కార్లలో మాత్రమే సందర్శకులు తిరగవచ్చునని తెలుస్తోంది. ఎవరు కిందకు దిగేందుకు అనుమతి లేదు. పార్కులోని భద్రతా దళాలు క్షణాల్లో స్పందించి పులిని వెంటాడినప్పటికి ఆమె ప్రాణాలు దక్కలేదు.

ఈ ఘటనతో పార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. కాగా, వైల్డ్ లైఫ్ పార్కులో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆ మహిళ తన భర్తతో గొడవపడిందని, ఆ తర్వాత ఆమె కారు దిగిందని, ఆ సమయంలో పులి ఎత్తుకెళ్లిందని అంటున్నారు.

ఆ కారులో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. వారు కారు దిగి సాయం చేసేందుకు ప్రయత్నించే లోపే.. ఎత్తుకెళ్లిన పులితో పాటు మరో పులి కూడా దాడి చేసి ఆమెను చంపేశాయి. పెద్దపులి దాడి దృశ్యాలు సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Siberian tigers at a wildlife park in Beijing have mauled a woman to death and wounded another when they stepped out of their car in an enclosure, a Chinese state-run newspaper said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి