ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా టిమ్ కుక్ డోంట్ కేర్.. అవన్నీ భారత్ లో తయారైన ఐఫోన్లేనంటూ..

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో విక్రయిస్తున్న అధిక శాతం ఐఫోన్ లు భారత్ లో తయారు చేసినవే అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యాపిల్ సంస్థ తీరుపై వార్నింగ్ ఇచ్చినా యాపిల్ మాత్రం భారత్ లోని ఐఫోన్ ల తయారీలో దూసుకెళ్తోంది. ఐఫోన్ క్వార్టర్లీ విక్రయాల ఫలతాలు జులై 31న వచ్చాయి. ఈ క్రమంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రసంగించారు.

యూఎస్ మార్కెట్ లో ఐఫోన్ విక్రయాల కోసం భారత్ నుంచే అత్యధికంగా ఐఫోన్ లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఐఫోన్ తయారీకు భారత్ మెయిన్ హబ్ గా మారిందన్నారు. తయారీ, ఆదాయ పరంగా యాపిల్ కంపెనీకి భారత్ కలిసొచ్చిందని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. ఐఫోన్ ల సేల్స్ కారణంగా భారత్‌ లో రికార్డ్ స్థాయిలో ఆదాయ వృద్ధి నమోదైందన్నారు. ఇతర యాపిల్ సంస్థ వస్తువులైన మాక్ బుక్, ఐపాడ్స్, యాపిల్ వాచెస్.. వియత్నాంలో తయారు చేస్తున్నామని.. ఇక ఇతర దేశాలకు చైనాలో తయారైన వాటిని ఎగుమతి చేస్తున్నామని టిమ్ కుక్ వెల్లడించారు. మరోవైపు భారత్ లో యాపిల్ సంస్థను ఏర్పాటు చేసి ఐఫోన్లు తయారు చేయాలన్న సంస్థ నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.

మే 15 న దోహా నగరంలో నిర్వహించిన వాణిజ్య ప్రెస్ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని భారత్ ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. " నాకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉంది. నేను అతనికి చెప్పాను. మీరు 500 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నారని విన్నాను. ఈ పెట్టుబడులు భారత్ లో పెడుతున్నారని విన్నాను. మీరు భారత్ ను ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు ఇండియా అభివృద్ధి చెందాలి.. మా కంపెనీకి ఏమైనా పర్వాలేదు అంటే మీ ఇష్టం. భారత్ లో టారిఫ్ లు చాలా అధికం. దాని వల్ల ఆ దేశం లాభపడుతుంది. కానీ యాపిల్ కూ ఏమీ రాదు. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా" అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

Tim Cook Defies Trump Most iPhones Sold in US Now Made in India

ఇక తాజాగా భారత్ పై ట్రంప్ ఏకంగా 25 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు ఉంది. అలాగే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ ​పై 24 గంటల్లో భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్‌ పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+