పాము మాంసం కోసం ఆ గ్రామస్థులు ఏం చేశారంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బోర్నియా: పామలు మాంసానికి అలవాటు పడిన వారు కొండచిలువలను కోసి కూర వండుకొని తిన్నారు. ఈ ఘటన మలేసియాలోని బొర్నియా ద్వీపంలో చోటు చేసుకొంది.పాముల మాంసానికి అలవాటుపడిన ఆ గ్రామస్థులు పాముల వేటకు బయలుదేరితే వారికి పాములే రోడ్డు పక్కన కన్పించాయి.

పాముల వేటకు బయలుదేరిన గ్రామస్థులకు రోడ్డు పక్కనే వింత శబ్దం రావడంతో నిశితంగా పరిశీలించారు. కూలిపోయిన చెట్టు దుంగ నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించారు. కొండచిలువ దుంగలో ఉందని అనుమానం రావడంతో.. వెంట తెచ్చుకున్న రంపంతో దుంగను మధ్యలోకి కోశారు.

 Tiny male python and the massive 20ft female he was mating with are killed by hungry villagers and chopped up to be cooked in a STIR FRY

రెండు కొండచిలువలు పెనవేసుకొని ఉండడాన్ని వారు గుర్తించారు. దీంతో పాములను విడదీసి తుపాకీతో కాల్చి చంపేశారు.ట్రక్కులో వాటిని గ్రామానికి తరలించారు. అనంతరం గ్రామంలోని మహిళలు అందరూ కలసి రెండు కొండచిలువలను ముక్కలుగా కోశారు.

స్థానిక ఆచారం ప్రకారం.. కొండచిలువలను మంటపై కాల్చారు. కొండచిలువల మాంసంతో పాటు సంప్రదాయ వంటకాలతో కలసి భోజనం చేశారు. ఒక్కసారి వేటకు వెళ్తే వచ్చే పాముల ఆహారంతో కొన్ని రోజుల పాటు గ్రామస్థులు జీవిస్తారని గ్రామ పెద్ద ఒకరు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A massive 20 foot female python and the tiny male it was mating with were killed by hungry villagers who chopped up the creatures and cooked them in a stir fry.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి