వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టోక్యో: ప్రపంచంలో ఇప్పటికే ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫా త్వరలో రెండో స్థానంలోకి వెళ్లనుంది. 'నెక్ట్ టోక్యో 2045' ప్రాజెక్టులో భాగంగా జపాన్ రాజధాని టోక్యోలో 1600 మీటర్ల ఎత్తైన ఓ భారీ స్కై టవర్ (ఆకాశహార్మ్యం) రానుంది.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో జెడ్డా టవర్ నిర్మాణం జరుగుతోంది. దీని ఎత్తు సరాసరి ఆకాశంలోకి ఒక కిలో మీటర్. అయితే బుర్జ్ ఖలీఫా, జెడ్డా టవర్ల కంటే, ఎప్పటికీ ప్రపంచంలోనే ఎత్తైన టవర్‌ను నిర్మించాలనే పట్టుదలతో జపాన్‌లో ఓ భారీ టవర్ నిర్మాణం జరగనుంది.

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'


ఈ టవర్‌కు 'స్కై మైల్ టవర్' అని పేరు పెట్టారు. ఈ టవర్ ఎత్తు సరాసరి 1,600 మీటర్లు. అంటే బుర్జ్ ఖలీఫా‌కు రెండింతలు. బుర్జ్ ఖలీఫా సరాసరి దాదాపు 800 మీటర్లపైన ఎత్తుంటుంది. కిలో మీటర్నరకు పైగా ఎత్తుతో కనిపించబోయే ఈ నిర్మాణాన్ని ఖాన్ పెడర్సన్ ఫాక్స్ అసోసియేట్స్(కేపీఎఫ్), లిస్లీ ఈ రాబర్సన్ అసోసియేట్స్(ఎల్ఈఆర్ఏ) అనే సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించనున్నాయి.

 అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'


ఈ టవర్‌ను జపాన్‌ రాజధాని టోక్యోలోని సముద్రం లోపల నిర్మించనున్నారు. 2045 నాటికి ఈ ఆకాశహార్మ్యం పూర్తి అవుతుందని అంచనా. ఈ టవర్‌కు సంబంధించిన నమునా చిత్రాలు విడుదల చేశారు. ఇందులో నివాస సముదాయాలతో పాటు పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు.

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'


ఈ స్కై మైల్ టవర్ ఓవర్ ఒక్కటి నిర్మితమైతే ఇదో భారీ మెగాసిటీగా మారుతుంది. దాదాపు 55 వేలమంది ఇందులో నివాసం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సముద్రంలో నిర్మాణం చేపడుతున్న ఈ టవర్‌కు అలలపోటు తగలకుండా దాని చుట్టూ రింగుల వంటి నిర్మాణాలు దాఆపు 500 నుంచి 5000 చదరపు మైళ్ల వెడల్పుతో నిర్మించనున్నారు.

 అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'

అద్భుత నిర్మాణం: టోక్యోలో 'స్కై మైల్ టవర్'


ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో నిర్మించే ఎన్నో నగరాలకు ఈ 'స్కై మైల్ టవర్' ఆదర్శంగా నిలవనుంది. వీటి నిర్మాణం గనుక పూర్తయితే 2021నాటికి ఈ కొత్త జాబితా రానుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన టవర్ల జాబితాలో దుబాయ్‌లోని బుర్జి ఖలిఫా, షాంఘై టవర్, మక్కా రాయల్ క్లాక్ టవర్ కూడా ఉన్నాయి.

English summary
Rising like the Emerald City is a building that will not only dwarf the world's tallest skyscraper -- the Burj Khalifa in Dubai -- but double its height.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X