Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరల్డ్ లోనే మోస్ట్ పవర్ ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగిన దేశాలు ఇవే..

దేశ రక్షణలో తగ్గేదేలే అన్నట్లుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దూసుకెళ్తున్నాయి. దేశంపైకి వచ్చే విమానాలు, డ్రోన్ లు, క్షిపణులను రాడార్ వ్యవస్థ సాయంతో గుర్తించి తక్షణమే నేల కూల్చుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, ఆధిపత్య పోరు నెలకొన్న క్రమంలో ప్రతి దేశం.. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ఆసక్తి చూపిస్తోంది. యుద్ధ రంగంలోనూ అత్యాధునిక టెక్నాలజీని జోడించిన నేపథ్యంలో ప్రస్తుతం అనేక దేశాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను అలవరచుకుంటున్నాయి.

ప్రస్తుతం అత్యాధునిక యుద్ధ వాతావరణంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ వ్యవస్థలు.. శత్రు దేశాల నుంచి వచ్చిన డ్రోన్లు, మిసైల్స్ ను టార్గెట్ పాయింట్ కు రీచ్ కాకముందే రాడార్ వ్యవస్థ సాయంతో గుర్తించి.. వాటిని ట్రాకింగ్ చేసి.. ఎయిర్ క్రాఫ్ట్ తో ఢీ కొట్టి భస్మీపటలం చేస్తాయి. ఏ ఏ దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు శక్తివంతంగా ఉంటే ఆ దేశాలు.. శత్రు దాడుల నుంచి ఏరియల్ దాడులను తిప్పికొడుతున్నాయి. మరి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఏ దేశాలు టాప్ లో ఉన్నాయి..?

ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో అమెరికా టాప్ ప్లేస్ లో ఉంది. అమెరికాలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో పాట్రియాట్(PAC-3), థాడ్ THAAD (Terminal High Altitude Area Defense) రక్షణ వ్యవస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ రక్షణ వ్యవస్థలకు ఎయిర్ క్రాఫ్ట్ , క్రూయిజ్ మిసైల్స్, మరికొన్ని బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటాయి . ప్రస్తుతం అమెరికా.. హైపర్ సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ మీద అధికంగా పెట్టుబడులు పెడుతోంది. అంతరిక్ష సంబంధిత సెన్సార్లు.. తదితర సాంకేతికత కారణంగా ప్రపంచంలోనే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కలిగి ఉంది.

ఇక రెండో స్థానంలో రష్యా ఉంది. ప్రస్తుతం రష్యా వద్ద ఎస్-400, ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగి ఉన్నాయి. ఎస్-400 రక్షణ వ్యవస్థ.. 400 కిలోమీటర్లకు మించిన రేంజ్ వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఇక ఎస్-500 రక్షణ వ్యవస్థ.. అత్యధిక ఎత్తు నుంచి దేశంవైపునకు వచ్చే బాలిస్టిక్, హైపర్ సోనిక్ క్షిపణులను అడ్డుకుంటుంది. రష్యా భూభాగం మొత్తం ఈ రాడార్ వ్యవస్థ కవరేజీలో ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చైనా మూడోస్థానంలో ఉంది. చైనాలో హెచ్ క్యూ- 9, అలాగే హెచ్ క్యూ-22 వ్యవస్థలను సుదూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రోన్ లు, క్షిపణులను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించారు. సౌత్ అండ్ ఈస్ట్ చైనా సముద్రంపై నిఘా కోసం ఈ వ్యవస్థలకు అడ్వాన్స్ డ్ రాడార్ వ్యవస్థ, కమాండ్ లింక్స్ ను అమర్చారు.

ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాలుగో స్థానంలో ఉంది. ఆకాశ మార్గంలో మూడంచెల పర్యవేక్షణను ఇజ్రాయెల్ కలిగి ఉంది. షార్ట్ రేంజ్ రాకెట్స్ కు ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. మీడియం రేంజ్ త్రెట్స్ కు డేవిడ్స్ స్లింగ్ ఉంది. అలాగే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కు యారో వ్యవస్థ కలిగి ఉంది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎంతో కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఇక ఐదో స్థానంలో భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఆసియా ఖండంలోనే మోస్ట్ అడ్వాన్స్ డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా భారత్ నిలిచింది. భారత్ లో ప్రస్తుతం ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ కు చుక్కలు చూపించింది.

Top 10 Air Defense Systems That NO Missile Can Beat 2025 Ranking

ఈ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ భారత్ పై సంధించిన డ్రోన్ లు, క్షిపణులను ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం ఎస్-400 ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా ఉంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ట్రాకింగ్ చేసే సత్తా ఈ వైమానిక రక్షణ వ్యవస్థకు ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+