అత్యధిక ధనవంతులు ఉన్న టాప్ 10 దేశాలివే.. భారత్ ఎన్నో ప్లేస్ అంటే ?

ప్రపంచ వ్యాప్తంగా సంపద ఎలా విస్తరిస్తుందో, ఏ దేశాలు ఆర్థికంగా ముందంజలో ఉన్నాయో తెలియజేస్తూ 'నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024’ విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశం 11వ స్థానంలో నిలిచింది. ఈ జాబితా ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులు (Ultra High Net Worth Individuals - UHNWIs) అంటే కనీసం $30 మిలియన్ల (₹265 కోట్లు) పైగా ఆస్తులు కలిగిన వ్యక్తుల సంఖ్య ఆధారంగా రూపొందించబడింది.

'నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024’ ప్రకారం 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా సూపర్ రిచ్ వ్యక్తుల సంఖ్య 28% పెరగవచ్చు. ఆసియా-పసిఫిక్ ప్రాంతం కొత్త బిలియనీర్ల కేంద్రంగా మారనుంది. గ్లోబల్ సంపదలో 25% వరకు ఆసియా దేశాల వాటా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

top-10-countries-of-wealthiest-people-acorss-the-world

టాప్ 10లో ఉన్న దేశాలు..

స్థానం దేశం అత్యంత సంపన్నుల సంఖ్య

1 అమెరికా 2,25,077

2 చైనా 98,551

3 జర్మనీ 29,021

4 కెనడా 27,928

5 ఫ్రాన్స్ 24,941

6 యునైటెడ్ కింగ్‌డమ్ 23,072

7 జపాన్ 21,710

8 ఇటలీ 15,952

9 ఆస్ట్రేలియా 15,347

10 స్విట్జర్లాండ్ 14,734

🇺🇸 అమెరికా మళ్లీ అగ్రస్థానంలో..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పటిలాగే అమెరికా అగ్రగామిగా కొనసాగుతోంది. అమెరికాలో మొత్తం 2,25,077 మంది వ్యక్తులు $30 మిలియన్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో తొమ్మిది మంది అమెరికన్లే, ఇది ఆ దేశంలో ఉన్న వ్యాపార, టెక్ రంగాల శక్తిని సూచిస్తోంది. సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల వ్యవస్థ అమెరికాకు ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టింది.

చైనా రెండో స్థానంలో..

చైనా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, సంపద కేంద్రీకరణలో కూడా రెండో స్థానాన్ని దక్కించుకుంది. చైనాలో 98,551 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. బీజింగ్, షాంఘై, షెన్జెన్ వంటి నగరాలు గ్లోబల్ బిజినెస్ హబ్‌లుగా మారడం దీనికి ప్రధాన కారణం. టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు ఈ పెరుగుదీకి బలంగా ఉన్నాయి.

జర్మనీ మూడో స్థానంలో..

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న జర్మనీ, ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. జర్మనీలో 29,021 మంది వ్యక్తులు $30 మిలియన్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. ఆటోమొబైల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాలు ఈ దేశాన్ని సంపన్న దేశాల జాబితాలో ముందుకు తీసుకువచ్చాయి.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. భారతదేశంలో 13,263 మంది వ్యక్తులు $30 మిలియన్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. నైట్ ఫ్రాంక్ అంచనా ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య 60 శాతం పెరగవచ్చని తెలిపింది.

మిగిలిన దేశాలు..

భారతదేశం తరువాత స్థానాల్లో ఉన్న దేశాలు:

12. స్పెయిన్ (10,149)

13. నెదర్లాండ్స్ (8,390)

14. తైవాన్ (7,640)

15. దక్షిణ కొరియా (7,310)

16. హాంకాంగ్ (5,957)

17. సింగపూర్ (4,783)

18. స్వీడన్ (4,125)

19. న్యూజిలాండ్ (2,587)

20. నార్వే (2,276)

ఈ దేశాలు జనాభా పరంగా చిన్నవైనా, వ్యక్తి పర్ క్యాపిటా ఇన్‌కమ్ దృష్ట్యా ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలుగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+