ఉక్రెయిన్ విడిచి వెళ్తున్న ప్రజలతో సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్; తాజాపరిస్థితి చెప్పిన శాటిలైట్ చిత్రం

ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా సైనిక చర్య నేపథ్యంలో, కొనసాగుతున్న బాంబు దాడులతో, వైమానిక దాడులతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్రెయిన్లోని తాజా పరిస్థితిని, ఉక్రెయిన్ వదిలిపెట్టి ఇతర దేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజల తాజా స్థితిని ఉపగ్రహ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. ఉక్రెయిన్ ను వదిలి పెట్టి ఇతర దేశాలకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజలతో రహదారుల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లుగా ఆ చిత్రం చూపించింది.

పొరుగు దేశాలకు వెళ్తున్న ఉక్రెయిన్ వాసులు .. సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్

పొరుగు దేశాలకు వెళ్తున్న ఉక్రెయిన్ వాసులు .. సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్

రష్యా దాడితో ఉక్రెయిన్లో ఎటుచూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బాంబుల మోతే వినిపిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి క్షణమొక యుగంలా గడుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన, బ్రతికి బయట పడతామా అన్న ఆందోళన ఉక్రెయిన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఓవైపు యుద్ధంలో మారణకాండ కొనసాగుతుంటే మరోవైపు బ్రతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ వాసులు.

 రొమేనియా- ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో ట్రాఫిక్ జామ్ .. శాటిలైట్ చిత్రం

రొమేనియా- ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో ట్రాఫిక్ జామ్ .. శాటిలైట్ చిత్రం

రష్యా క్షిపణులు రాజధాని కైవ్‌ను ఢీకొట్టడంతో ప్రజలు పొరుగు దేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో రొమేనియాతో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో కార్లు మరియు ట్రక్కులతో సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు ఓ సాటిలైట్ చిత్రం వెల్లడించింది. హై-రిజల్యూషన్ చిత్రాలను పంచుకున్న మాక్సర్ టెక్నాలజీస్ ప్రకారం, శుక్రవారం సిరెట్ సరిహద్దు క్రాసింగ్ సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినట్టుగా పేర్కొంది.

పోలాండ్, రొమేనియా, హంగేరి మరియు స్లోవేకియాలకు వలస.. మహిళలు, పిల్లలు మాత్రమే

పోలాండ్, రొమేనియా, హంగేరి మరియు స్లోవేకియాలకు వలస.. మహిళలు, పిల్లలు మాత్రమే

రష్యా క్షిపణులు రాజధాని కైవ్‌పై దాడి చేయడంతో శుక్రవారం పోలాండ్, రొమేనియా, హంగేరి మరియు స్లోవేకియాలో ఉక్రేనియన్ జాతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు, రద్దీగా ఉండే సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద చాలా మంది గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులకు ప్రయాణాన్ని పరిమితం చేసినందున పొరుగు దేశాలకు దాటుతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది.

ఉక్రెయిన్ నుండి పోలాండ్లోకి వలస వెళ్ళిన 29,000 మంది

ఉక్రెయిన్ నుండి పోలాండ్లోకి వలస వెళ్ళిన 29,000 మంది

ఉత్తర రొమేనియా సరిహద్దులో, మోల్డోవా మరియు నల్ల సముద్రం మధ్య ఉన్న పట్టణమైన ఇసాక్సియాలోకి డానుబే నది మీదుగా షిప్ ఎక్కడం కోసం కార్లు వేచి ఉండటంతో పెద్ద క్యూలు నివేదించబడ్డాయి. కనీసం 29,000 మంది ప్రజలు గురువారం ఉక్రెయిన్ నుండి పోలాండ్‌లోకి ప్రవేశించారు. మధ్య ఐరోపా అంతటా, నాటో యొక్క తూర్పు పార్శ్వంలో, సరిహద్దుల నుండి వచ్చే ప్రజలకు పునరావాసం కల్పించడానికి మరియు రవాణాను నిర్వహించడానికి వాలంటీర్లు సోషల్ మీడియాలో సందేశాలను ఉంచారు. కార్యకర్తలు ఆహారం మరియు వేడి పానీయాల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం పశువైద్యులు ఇస్తున్నారు.

బల్గేరియన్ పౌరులను తరలించే ఏర్పాటు చేసిన బల్గేరియా

బల్గేరియన్ పౌరులను తరలించే ఏర్పాటు చేసిన బల్గేరియా


బల్గేరియా, అదే సమయంలో, ప్రయాణ పత్రాలు అవసరమైన కైవ్‌లోని తన పౌరులకు పాస్‌పోర్ట్‌లను జారీ చేయడం ప్రారంభించింది . ప్రజలను ఖాళీ చేయడానికి ఉక్రేనియన్ రాజధానికి నాలుగు బస్సులను పంపింది. 130 మంది బల్గేరియన్లను తరలించే మూడు బస్సులు శుక్రవారం ఒడెసా నుండి బయలుదేరుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్‌లో దాదాపు 250,000 బల్గేరియన్లు నివసిస్తున్నారు. వారిని తరలించే ప్రయత్నం చేస్తుంది బల్గేరియా.

Recommended Video

    Russia Destroyed Ukraine Military Air Bases And Air Defenses | Oneindia Telugu
    ఉక్రెయిన్ లో మరణాల సంఖ్యను నిర్ధారించని రష్యా

    ఉక్రెయిన్ లో మరణాల సంఖ్యను నిర్ధారించని రష్యా

    ఇప్పటి వరకు కనీసం 1,000 మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా మృతుల గణాంకాలను విడుదల చేయలేదు. 25 మంది పౌరులు మరణించారని మరియు 102 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి తెలిపింది, ఈ గణాంకాలు "గణనీయమైన తక్కువ అంచనా" కావచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+