అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. రోజురోజుకూ కాల్పుల ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికా ఉలిక్కిపడింది. తాజాగా అమెరికాలోని మిస్సిసిపీ రాష్ట్రంలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు. మిస్సిసిపీలోని లీ లాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

అమెరికాలోని మిస్సిసిపీ రాష్ట్రం జాక్ సన్ నగరానికి 200 కి. మీ. దూరంలోని లీలాండ్ అనే మారుమూల ప్రాంతంలో ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. దుండగుడ్ని గాలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే ఓ లీలాండ్ హై స్కూల్ ఉంది. హోమ్ కమింగ్ గేమింగ్ కోసం ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై మిస్సిసిపీ రాష్ట్ర సెనేట్ డెరిక్ సిమ్మాన్స్ విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో పెరుగుతున్న గన్ ఫైరింగ్స్ పై మండిపడ్డారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మరోవైపు మిస్సిసిపీ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ అధికారులు ఈ ఘటనపై స్పందించారు. నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.

Tragedy in Leland Four Dead in Mass Shooting After High School Homecoming

మరోవైపు అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని ఓ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 19కు చేరినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఆకాశాన్ని తాకేలా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అధికారులు అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పేలుడు దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+