వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్టోరియా సరస్సులో కూలిపోయిన టాంజానియా విమానం: గల్లంతైన ప్రయాణికులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టాంజానియాకు చెందిన ప్రయాణీకుల విమానం బుకోబా సరస్సులో ల్యాండ్ కావడానికి ప్రయత్నించి విక్టోరియా సరస్సులో కూలిపోయింది.

ప్రెసిషన్ ఎయిర్ విమానంలో 43 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 26 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. గల్లంతైన వారిలో పలువురి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు సరస్సులో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు. నీటి పైన ఉన్న విమానం దాదాపు పూర్తిగా మునిగిపోయింది. రెస్క్యూ వర్కర్లు, ఫిషింగ్ బోట్‌లతో చుట్టుముట్టారు.

Tragedy: Tanzanian Precision Air plane crashes into Lake Victoria, passengers drowned in lake

ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు అయిన విక్టోరియా సరస్సు నుంచి ఏటీఆర్ 42-500 విమానాన్ని బయటకు తీయడానికి అత్యవసర కార్మికులు తాళ్లను ఉపయోగిస్తున్నారు.

"ల్యాండింగ్ గేర్ చిక్కుకుపోయిందో లేదో చూడాలనుకుంటున్నాము, తద్వారా దానిని నీటి నుంచి బయటకు నెట్టడానికి మరింత సాంకేతిక సహాయం కోసం అవసరం కావచ్చు" అని ప్రాంతీయ ఉన్నత అధికారి ఆల్బర్ట్ చలమిలా చెప్పారు.

బుకోబా విమానాశ్రయం రన్‌వే ఒక చివర తీరానికి పక్కనే ఉండటం గమనార్హం.

ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్ బాధితలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

విమానం టాంజానియాలోని అతిపెద్ద నగరం దాస్ ఎస్ సలామ్ నుంచి మ్వాన్జా మీదుగా బుకోబాకు వెళుతుండగా.. తుఫాను, భారీ వర్షాలు కురిసినట్లు నివేదించబడింది.

ప్రెసిషన్ ఎయిర్ అనేది టాంజానియా అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ, పాక్షికంగా కెన్యా ఎయిర్‌వేస్ యాజమాన్యంలో ఉంది.

English summary
Tragedy: Tanzanian Precision Air plane crashes into Lake Victoria, passengers drowned in lake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X