'బంగ్లా'లో తారాస్థాయికి చేరిన హింస.. హిందూ దేవాలయాలు,రైళ్లపై దాడులు.. ఇప్పటివరకూ 13 మంది మృతి...
బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ పెల్లుబికిన నిరసనలు ఆదివారం(మార్చి 28) తారాస్థాయికి చేరాయి. వందలాది మంది ఇస్లామిస్ట్ గ్రూప్ సభ్యులు హిందూ దేవాలయాలపై,రైళ్లపై దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం(మార్చి 28) నుంచి కొనసాగుతున్న ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
శుక్ర(మార్చి 26),శనివారాల్లో(మార్చి 27) భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. బంగ్లాలో మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం నుంచే నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారత్‌లోని ముస్లింల పట్ల ప్రధాని మోదీ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఆందోళనకు దిగాయి.

ఆదివారం(మార్చి 28) వందలాది మంది ఇస్లామిస్ట్ గ్రూప్ సభ్యులు ఢాకా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనల్లో హెఫాజత్ ఇ ఇస్లామ్ అనే గ్రూప్ మద్దతుదారులు బ్రహ్మన్‌బరియాలో ప్యాసింజర్ రైలుపై దాడికి పాల్పడ్డారు.రైలు ఇంజిన్‌తో పాటు దాని కోచ్‌లన్నింటినీ వారు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బ్రహ్మన్‌బరియాకు చెందిన జావెద్ రహీమ్ అనే జర్నలిస్ట్ మాట్లాడుతూ... దేశంలోని పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలపై ఇస్లామిస్ట్ గ్రూప్స్ దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారని,వాటిని తగలబెట్టారని తెలిపారు. ప్రస్తుతం తాము తీవ్ర భయాందోళనలో,నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు.
రాజ్‌షాహి జిల్లాలోని ఓ ప్రాంతంలోనూ ఆందోళనకారులు రెండు బస్సులను తగలబెట్టారు. చాలాచోట్ల పోలీసుల పైకి వారు రాళ్లు రువ్వారు. టింబర్,ఎలక్ట్రిక్ పోల్స్,ఇసుక బస్తాలతో రహదారులను దిగ్బంధించారు. మరోవైపు జరిగిన హింసకు పోలీసులదే కారణమని హెఫాజత్ ఇ ఇస్లామ్ సెక్రటరీ అజిజుల్ హక్ పేర్కొనడం గమనార్హం. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై అకారణంగా పోలీసులు కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు.
కాగా,బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన మోదీ... పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం తాను సత్యాగ్రహం కూడా చేశానని... ఆ కారణంగా జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. అయితే మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 'ఫేక్ న్యూస్' అంటూ మోదీ వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications