షాకింగ్: అందాల సుందరి... చెత్తపని! ప్రశంసించాలా? పిచ్చి పీక్స్ అనుకోవాలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదే. సాధారణంగా అందాల కిరీటం గెలిచిన వారెవరి లక్ష్యమైనా మోడలింగ్ లేదా సినిమా రంగం అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ అందాల సుందరి లక్ష్యం మాత్రం విచిత్రంగా ఉంది.

మిస్ బ్రూక్లిన్‌, మిస్ స్తాటేన్‌ గా అందాల పోటీల్లో పాల్గొన్న అందాల సుందరి నికోల్ డోజ్ (23) మోడలింగ్ వృత్తిని కాదని పారిశుద్ధ్య శాఖలో ఉద్యోగిగా చేరడం అందాలరంగంలో ప్రస్తుతం సంచలనం రేపింది.

'Trashy but classy': New York City beauty queen, 23, lands her dream job collecting garbage

న్యూయార్క్ నగరంలోని పారిశుద్ధ్య శాఖలో ఆమె ఉద్యోగిగా చేరింది. న్యూయార్క్ నగరంలో పనిచేసే 200 మంది మహిళా ఉద్యోగుల్లో నికోల్ డోజ్ కూడా ఒకరు కావడం విశేషం. ఆ పట్టణంలోని ఒక చెత్త సేకరించే రూట్లో ఆమె ఒక్కరే మహిళా ఉద్యోగి కావడం అంతకంటే విశేషం.

అయితే జనవరిలో జరిగే మరో అందాలపోటీలో కూడా తాను పాల్గొననున్నానని నికోల్ డోజ్ తెలిపింది. అందాల సుందరిగా రాణించడం ఆత్మవిశ్వాసం ఇస్తోందని ఆమె తెలిపింది. బికినీ ధరించి హైహీల్స్ తో నడవడాన్ని ఆస్వాదిస్తానని ఆమె తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A New York beauty queen contestant says she has landed her dream job... with the city's sanitation department. Nicole Doz, who recently competed in the Miss Brooklyn and Miss Staten Island beauty pageants, calls the job 'trashy but classy.''What I really like the most about it is that it really shocks people, telling them what I do as my career,' she told CBS 2 News during an interview. 'They would never expect it.'

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి