ఢిల్లీలో భూకంపం: 5.4 తీవ్రతతో ప్రకంపనాలు, వారంలో రెండోసారి..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. శనివారం తీవ్రతతో భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా ఉంది. ఢిల్లీలో రాత్రి 7.57 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉందని సిస్మాలజిస్టులు తెలిపారు. భూకంపం రావడంతో జనం పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

భూ ప్రకంనాలు ఉత్తరాఖండ్, న్యూ తెహ్రి, ఫిత్రొఘడ్, భాగేశ్వర్, పౌరీలో కూడా వచ్చాయి. గతవారం కూడా ఢిల్లీలో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. గత బుధవారం నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో అక్కడ 9 మంది చనిపోయారు. అప్పుడు ఢిల్లీలో కూడా ప్రకంపనాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications