యూఎస్ ట్రావెల్ బ్యాన్: సూడాన్ అవుట్.. ఉత్తరకొరియా, వెనిజులా ఇన్.. ట్రంప్ కొత్త ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు తన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను సవరించుకున్నారు. తొలుత ఏడు దేశాల పౌరులపై ప్రయాణ నిషేధ ఆంక్షలు విధించిన ఆయన, తాజాగా ఆ జాబితా నుంచి సూడాన్ ను తొలగించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు తన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను సవరించుకున్నారు. తొలుత ఏడు దేశాల పౌరులపై ప్రయాణ నిషేధ ఆంక్షలు విధించిన ఆయన, తాజాగా ఆ జాబితా నుంచి సూడాన్ ను తొలగించారు.
అంతేకాదు, కొత్తగా ఈ జాబితాలో.. ఉత్తరకొరియా సహా, వెనిజులా, చాద్ దేశాలను ట్రంప్ కలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అమెరికా రక్షణే తన కర్తవ్యమని ఆ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.
తాను పేర్కొన్న దేశాల నుంచి అమెరికాకు ముప్పు ఉందని భావిస్తుండబట్టే, ఆయా దేశాల పౌరులను అమెరికాలోనికి అనుమతించడం లేదని ఈ ప్రకటన విడుదలైన తరువాత ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.

ఈ సంవత్సరం మార్చిలో సిరియా, ఇరాక్, లిబియా, ఇరాన్, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్ నిషేధం విధించగా, ఆ ఉత్తర్వుల గడువు గత గురువారంతో ముగిసింది.
మరోవైపు తాను విధించిన ట్రావెల్ బ్యాన్ పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున, విచారణ ముగిసేవరకూ ప్రయాణ నిషేధాలను పొడిగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంది. ఈ మేరకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
-
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications