US వీసాదారులకు ట్రంప్ షాక్: H1B ఉంటే గ్రీన్ కార్డ్ రానట్టే?

అమెరికాలో కొలువు చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి చమటలు పట్టిస్తోంది. హెచ్‌-1బీ వీసా నిబంధనలను సమూలంగా మారుస్తూ అమెరికా కార్మిక శాఖ (DOL) సిద్ధం చేసిన సరికొత్త ప్రతిపాదనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం ఉద్యోగ నియామకాలే కాకుండా, అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందాలనుకునే వారి కలలపై ఈ ప్రతిపాదనలు కోలుకోలేని దెబ్బ తీసేలా ఉన్నాయి.

ఈ ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైన అంశం 'ద్వంద్వ ఉద్దేశం' (Dual Intent) రద్దు. ఇప్పటివరకు హెచ్‌-1బీ వీసాపై అమెరికా వెళ్లిన వారు అక్కడ పనిచేస్తూనే శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. హెచ్‌-1బీ అనేది కేవలం 'తాత్కాలిక అవసరాల' కోసమేనని, దీనిని శాశ్వత నివాసానికి సోపానంగా వాడకూడదని ట్రంప్ సర్కారు స్పష్టం చేస్తోంది. అంటే, వీసా గడువు ముగియగానే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే అనే నిబంధనను కఠినతరం చేయబోతున్నారు.

Trump Admin Proposes Tough H1B Visa Rules End of Green Card Path for Temporary Foreign Workers in the US

జీతం పెంచాల్సిందే.. అమెరికన్లకే మొగ్గు!

స్థానిక అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా 'బై అమెరికన్ - హైర్ అమెరికన్' నినాదాన్ని ప్రభుత్వం మరింత తీవ్రతరం చేస్తోంది.

  • 30% వేతన పెంపు: విదేశీయులను తక్కువ జీతానికి నియమించుకుని అమెరికన్ల అవకాశాలను దెబ్బతీయకుండా ఉండటానికి, కనీస వేతనాన్ని ఏకంగా 30 శాతం పెంచాలని ప్రతిపాదించారు.
  • స్థానికులే ముఖ్యం: ఏదైనా పోస్టుకు విదేశీయుడిని తీసుకోవడానికి ముందు, ఆ ఉద్యోగానికి తగిన అమెరికా అభ్యర్థి దొరకలేదని కంపెనీలు బలంగా నిరూపించుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తోంది.

మాస్టర్స్ విద్యార్థులకే ఫస్ట్ ప్రయారిటీ

అమెరికా యూనివర్సిటీల్లో మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న అభ్యర్థులకే వీసా కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ నైపుణ్యాలు కలిగిన వారి కంటే, ఉన్నత విద్యావంతులకు మాత్రమే అమెరికా తలుపులు తెరుచుకోనున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థల విశ్లేషణ ప్రకారం.. ఈ నిబంధన వల్ల భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలకు నిర్వహణ వ్యయం భారీగా పెరగనుంది.

ప్రజాభిప్రాయ సేకరణ.. జూన్ వరకు ఊరట!

ఈ మార్పులపై అభిప్రాయాలను తెలిపేందుకు కార్మిక శాఖ 60 రోజుల గడువునిచ్చింది. అయితే, ప్రస్తుతానికి జూన్ 30లోపు దాఖలయ్యే పిటిషన్లపై ఈ ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ, దీర్ఘకాలంలో ఇది భారతీయ ఐటీ రంగానికి, అమెరికా వెళ్లాలనుకునే యువతకు పెద్ద అడ్డంకిగా మారనుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు ఎలా స్పందిస్తాయోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+