భారత ఐటీకి షాక్: 'హెచ్-1బి' మరింత కఠినతరం.. అమెరికా కొత్త పాలసీ

న్యూఢిల్లీ: ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సంస్థల్లోనూ స్థానికులకే కంపెనీలు ప్రాధాన్యతనిచ్చేలా వీసా నిబంధనలు సడలిస్తూ వచ్చారు.

తాజాగా మరోసారి హెచ్1బి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలపై, ఆ సంస్థల ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది.

అదనపు వివరాలు కూడా..:

అదనపు వివరాలు కూడా..:

కొత్త పాలసీ ప్రకారం.. ఇకపై హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు అదనపు వివరాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగుల అదనపు వివరాలు, వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

 ఏప్రిల్‌ 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ..:

ఏప్రిల్‌ 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ..:

హెచ్1బి వీసా ప్రక్రియకు సంబంధించి ఏడు పేజీలతో కూడిన కొత్త పాలసీని అమెరికా బుధవారం విడుదల చేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే ఏప్రిల్‌ 2 నుంచి హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. అంతేకాదు.. కేవలం మూడేళ్ల కాలపరిమితితో మాత్రమే ఈ వీసాలు జారీ అవుతాయని స్పష్టం చేసింది.

కఠిన నిబంధనలు:

కఠిన నిబంధనలు:

విదేశాల్లోని ఉద్యోగులను అమెరికాలో నియమించుకోవడం అమెరికా జారీ చేసే తాత్కాళిక వీసా హెచ్-1బి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ఈ వీసా నిబంధనలు సడలించారు.

కేవలం అత్యుత్తమ స్కిల్స్ కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకోవడానికి అనుమతినిచ్చారు. కొత్త పాలసీలో దీనికి కొనసాగింపుగా.. సదరు ఉద్యోగుల నిర్దిష్టమైన క్వాలిఫైయింగ్ కు సంబంధించి అదనపు వివరాలను జోడించాల్సి ఉంటుంది.

 ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..:

ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..:

తమ ఉద్యోగుల కోసం అమెరికాలో హెచ్-1బి వీసాలు కోరే కంపెనీలు ఇకనుంచి దరఖాస్తుల విషయంలో పేపర్ వర్క్‌పై కాస్త ఎక్కువగానే ఫోకస్ చేయాల్సి ఉంటుంది.

వర్క్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు, మార్కెటింగ్ అనాలిసిస్, కాస్ట్ బెనిఫిట్, ఫండింగ్ డాక్యమెంట్స్ వంటి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+