ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..
మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఎందుకు ఓటేయలంటే అంటూ.. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ వివరిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇద్దరూ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
మిచిగాన్, విస్‌కొన్సిన్, మిన్నెసొటాలో ట్రంప్ శుక్రవారం ప్రచారం చేశారు. తమకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెబుతున్నారు. లొవా, విస్కిన్సిన్, మిన్నెసోటలో బిడెన్ కూడా ప్రచారం చేశారు. వర్చువల్, జూమ్ యాప్ ద్వారా కూడా క్యాంపెయిన్ చేస్తుండగా... వర్చువల్‌గా కూడా చేస్తున్నారు.

అరిజొనాలో మైక్ పెన్స్.. టెక్సాస్‌లో కమలా హ్యరిస్ ప్రచారం చేశారు. ఇటు ట్రంప్ కుటుంబసభ్యులు కూడా ప్రచారబరిలో మునిగిపోయారు. కూతుర్లు ఇవాంక ట్రంప్, టిఫానీ, కుమారులు ఎరిస్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్ కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రచార సందర్భంగా సామాజిక దూరం పాటించడం లేదు. కొన్ని చోట్ల మాస్క్ ధరించలేదు. మరికొన్ని చోట్ల మాస్క్ వేసుకున్నారు. అయితే బిడెన్ మాత్రం సామాజిక దూరం ఉండేలా చూసుకుంటున్నారు.
బిడెన్ ప్రజలను ఆకట్టుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు. అందుకు బిడెన్ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తించేందుకు ట్రంప్ ప్రచారం దోహదపడుతోందని బిడెన్ అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం అని మండిపడ్డారు. ఎన్నికల సమయం సమీపించడంతో.. అభ్యర్థులు ప్రచారం కోసమే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications