చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్‌..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు, హార్మూజ్ జలసంధి అంశంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. హార్మూజ్ జలసంధి తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయానికి వచ్చారు. ప్రధాని మోదీ- ట్రంప్ మాట్లాడుకున్న విషయాలను భారత్ లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ సహకరిస్తుందని పునరుద్ఘాటించారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసేందుకు భారత్ సహకరిస్తుందని అన్నారు. అయితే ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ లో సంభాషించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అనంతరం ప్రధాని మోదీ సైతం తన అధికారిక ఎక్స్ లో ఇదే విషయంపై పోస్టు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్ని పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తమ సహకారం అందిస్తుందని అన్నారు.

ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ సపోర్ట్ చేస్తుందని అన్నారు. హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యవసరం అని దాన్ని తెరవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు అమెరికాకు టచ్ లో ఉంటామని తెలిపారు.

Trump Calls PM Narendra Modi Discusses West Asia Tensions and Strait of Hormuz Trump Modi phonecall

ఇక అమెరికాతో యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇక రోజూ భారత్ కు దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు హార్మూజ్ మీదుగానే వస్తుంది. మరోవైపు ఇరాన్ కొత్త సెక్యూరిటీ చీఫ్ గా మహ్మద్ జోల్ ఘాద్ నియామకం అయ్యారు. అంతకుముందు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ గా ఉన్న అలీ లారిజానీ దాడుల్లో హతమైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+