ఇజ్రాయెల్, ఇరాన్ కు ట్రంప్ సంచలన వార్నింగ్.. భారత్, పాక్ లా మాటవినాలంటూ..

పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపేసినట్లే ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపేయబోతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ అధికారిక సామాజిక మాధ్యమం ట్రూత్ సోషియల్ లో పోస్టు చేశారు.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు విజయం దిశగా సాగుతున్నాయని అన్నారు. ఇటీవల భారత్- పాకిస్థాన్ యుద్ధం ఆపేసినట్లు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్రూత్ సోషల్ మాధ్యమంలో పోస్టు చేశారు.

Trump Claims Role in Stopping India-Pakistan War Vows to Halt Israel-Iran Conflict

" ఇరాన్- ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరపాలి. ఇరు దేశాలు ఒప్పందానికి రావాలి. భారత్- పాకిస్థాన్ మాదిరి యుద్ధం నిలిపివేయండి. భారత్- పాక్ ఇరు దేశాలూ యుద్ధం ఆపేసి అమెరికాతో వాణిజ్యం ప్రారంభించాయి. ఇరు దేశాధినేతలు అద్భుతంగా స్పందించారు. నా మొదటి పాలనలో సెర్బియా, కోసోవోల మధ్య దశాబ్దాలుగా సాగిన యుద్ధాన్ని నేను ఆపేశాను. బైడెన్ కొన్ని తిక్క నిర్ణయాలు తీసుకున్నారు. కానీ నేను వాటిని పరిష్కరించాను. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య యుద్దం ఆపేశాను. ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశాను. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కూడా మంచి మెసేజ్ లు, ఫోన్ సంభాషణలు జరుగుతున్నవి. యుద్దం ఆపేస్తాను. కానీ క్రెడిట్ మాత్రం తీసుకోను. నేను ఏంటో ప్రజలకు తెలుసు. మధ్య ఆసియాను మరోసారి దృఢంగా చేసేందుకు యత్నిద్దాం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్టు పెట్టారు.

ఇక ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. జూన్ 14 రాత్రి ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Trump Claims Role in Stopping India-Pakistan War Vows to Halt Israel-Iran Conflict

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన దాడుల్లో 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 180 మంది గాయపడ్డట్లు సమాచారం ఇచ్చారు. ఈ దాడుల్లో 7 గురు మిస్సింగ్ అయినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+