నేను అధ్యక్షుడిని, నీవు కాదు.. చెడుగా చేయట్లేదు: ట్రంప్, అప్పుడు నవ్వారు..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై మండిపడ్డారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను.. టైమ్స్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సమర్థించుకున్నారు.

తాను ఓ తరహా ఆలోచనలు కలిగిన వ్యక్తిని అని, తన స్వభావం, ఆలోచనలు సరైనవేనని, అవే నిజమవుతాయన్నారు. నేను అంత చెడుగా ఏమీ చేయట్లేదని అనుకుంటున్నానని, ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని అని, నువ్వు కాదు అని టైమ్స్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్‌తో అన్నారు.

Trump defends wild claims: 'I'm President, and you're not'

తన పాలసీలకు మద్దతుగా ట్రంప్ మాట్లాడారు. ఈజ్ ట్రూత్ డెన్.. అనే టైటిల్‌తో కవర్ స్టోరీ కోసం టైమ్స్ ట్రంప్ ఇంటర్వ్యూ తీసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చేసిన వైర్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన అంశంపై టైమ్స్ ప్రశ్నలు అడిగింది.

మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా తన ఫోన్‌ను వైర్ ట్యాప్ చేశారని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే ఒబామా అభ్యర్థన మేరకు బ్రిటిషఅ గూడఛార సంస్థ జీసీహెచ్‌క్యూ తన ప్రచారంపై నిఘా పెట్టిందని వ్యాఖ్యానించారు. వీటని ట్రంప్ సమర్థించుకున్నారు. బ్రెగ్జిట్ సమయంలో తాను అది జరుగుతుందని చెబితే అందరూ నవ్వారని, ఇప్పుడు అదే జరిగిందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump defends his unsubstantiated claims, says 'I'm president'
Please Wait while comments are loading...