చైనా గుండె గుబేల్.. 500 శాతం టారిఫ్ లతో ట్రంప్ మరణశాసనం.. ?
చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాపై ఏకంగా 500 శాతం టారిఫ్ లు విధించే దిశగా అమెరికా సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చైనా ముడి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా డ్రాగన్ కంట్రీపై 500 శాతం టారిఫ్ లు విధించేందుకు 85 సెనేటర్లు ట్రంప్ కు అధికారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో రష్యాకు యుద్ధ సాయం చేస్తుందని అన్నారు. అమెరికాతోపాటు అమెరికా మిత్ర దేశాలు సైతం చైనాపై చర్యలు తీసుకోబోతున్నట్లు స్కాట్ బీసెంట్ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అంతా APEC సమావేశంలో భేటీ కానున్న ట్రంప్- జెన్ పింగ్ మీదనే ఉంది. ఇక్కడ ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం అయితే చైనాపై 500 శాతం టారిఫ్ లు తప్పవని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చైనాను త్వరలోనే బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. చైనాపై అమెరికా ఏకంగా 500 శాతం టారిఫ్ లు విధించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం.. చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతిపై ఆంక్షలు పెట్టడం.. తదితర కారణాల వల్ల డ్రాగన్ పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. చైనాపై సుంకాలు విధించాలని 85 మంది యూఎస్ సెనేటర్లు ట్రంప్ కు సలహా ఇవ్వనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ తాజాగా తెలిపారు. ఈ విషయంలో ట్రంప్ కు అధికారం ఇచ్చేందుకు సెనేటర్లు సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 31న సౌత్ కొరియాలో జరగనున్న ఏషియా- పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్(APEC) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ కానున్నారు. ఈ చర్చలు విఫలం అయితే మాత్రం చైనాపై 500 శాతం టారిఫ్ లు తప్పవని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఈ టారిఫ్ లు అమల్లోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా అస్థవ్యస్థం అవుతుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆకాశాన్ని అందుతాయి.

ఒకవేళ ట్రంప్ నిర్ణయంపై చైనా ప్రతీకార సుంకాలు మొదలు పెడితే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం కుప్పకూలుతుంది. ఇక అమెరికా కూడా చాలావరకు దెబ్బతింటుంది.. అయితే రేర్ ఎర్త్ మినరల్స్ పై చైనా ఆంక్షలను వాయిదా వేస్తే అమెరికా ఆంక్షలు చైనాపై ఉండకపోవచ్చని స్కాట్ బీసెంట్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చైనా 70 శాతం రేర్ ఎర్త్ మినరల్స్ ను ఉత్పత్తి చేస్తోంది. 90 శాతం రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ పై అధికారం కలిగి ఉంది. ఈ అరుదైన ఖనిజాల ద్వారా డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, విండ్ ఎనర్జీ, ఆటోమొబైల్స్ రంగంలో ప్రపంచాన్ని శాసించాలని చైనా చూస్తోంది.












Click it and Unblock the Notifications